Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రియో ఒలింపిక్స్: లైంగిక దాడి కేసులో బాక్సర్‌ హసన్ అరెస్ట్

రియో డి జెనీరో: రియో ఒలింపిక్స్‌-2016లో ప్రారంభంలోనే వివాదం చోటు చేసుకుంది. ఒలింపిక్‌ గ్రామంలో ఇద్దరు బ్రెజిలియన్‌ హౌస్‌కీపర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడన్న ఆరోపణలపై మొరాకో బాక్సర్‌ హసన్‌ సాదా(22)ను అరెస్టుచేశారు అక్కడి పోలీసులు.

ఈ ఒలింపిక్స్‌లో ఇదే తొలి అరెస్ట్ కావడం గమనార్హం. బుధవారం అతడి గదిని శుభ్రపరుస్తుండగా.. తమపై అతడు లైంగిక దాడికి ప్రయత్నించినట్లు వారు ఫిర్యాదు చేశారని పోలీసులు వెల్లడించారు. అతడి బారి నుంచి వారు తప్పించుకోగలిగారని చెప్పారు.

Rio Olympics 2016: Moroccan boxer out after being arrested for sexual assault

ఆ గదిలో సాదాతో పాటు మరో ఇద్దరు అథ్లెట్లు ఉంటున్నారని, ఈ ఘటన జరిగినప్పుడు వారు అక్కడ లేరని తెలిపారు. నిజానికి తొలుత సాదా వారిపై అత్యాచారం చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. తర్వాత వేధింపులు మాత్రమేనని తేల్చారు.

దర్యాప్తు నేపథ్యంలో 15 రోజులపాటు సాదాను జైల్లో ఉంచే అవకాశం ఉంది. 81 కిలోల లైట్‌ హెవీవెయిట్‌ బాక్సర్‌ అయిన సాదా శనివారం టర్కీకి చెందిన మెహ్మెట్‌ నాదిర్‌తో తలపడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తనను విడిచిపెట్టాలని బాక్సర్ హసన్ కోరినా.. బ్రెజిలియన్ న్యాయ మంత్రిత్వ శాఖ అంగీకరించలేదు. దీంతో అతడు నాదిర్‌తో పోటీ పడతాడా? లేదా? అనేది సందిగ్ధంగా మారిపోయింది.

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+