రియో డీ జనీరో: రియో ఒలింపిక్స్‌లో నాల్గవ రోజు పోటీలు భారత్‌కు కలిసొచ్చేలా కనిపిస్తున్నాయి. తొలి మూడు రోజులు భారత అభిమానులను ఎంతగానో నిరాశపరిచాయి. ఒలింపిక్స్‌లో మూడు రోజు జరిగిన పోటీల్లో జిమ్నాస్టిక్స్ విభాగంలో దీపా కర్మాకర్ అంచనాలను అందుకుని ఫైనల్ చేరుకుంది.
తాజాగా సోమవారం కూడా భారత్‌కు మిశ్రమ ఫలితాలు వచ్చేలా కనిపిస్తున్నాయి. కాగా, రియో ఒలింపిక్స్‌లో నాలుగో రోజైన సోమవారం పోటీల్లో భాగంగా భారత షూటర్ అభినవ్ బింద్రా సత్తా చాటారు. సాయంత్రం 5.30 గంటలకు మొదలైన క్వాలిఫెయింగ్ రౌండ్‌లో చక్కని ప్రదర్శన కనబర్చి పురుషుల పది మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో 104.3, 104.4, 105.9, 103.8, 102.1, 104.5 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచాడు.

పది మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో షూటర్ అభినవ్ బింద్రా ఫైనల్‌కు అర్హత సాధించాడు. అటుపై క్వాలిఫెయింగ్ రౌండ్లతో కలిపి ఉత్తమ ప్రదర్శన ఇచ్చిన మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారు పతకం సాధిస్తారు. భారత్‌కు అభినవ్ బింద్రా గోల్డ్ మెడల్ తేవాలని దేశవ్యాప్తంగా కోరుకుంటున్నారు.
మరోవైపు అభినవ్ బింద్రాతో పాటుగా గగన్ నారంగ్ కూడా పురుషుల పది మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో పోటీపడినప్పటికీ ఫైనల్స్‌కు అర్హత సాధించలేక పోయాడు. ప్రాథమిక రౌండ్‌లోనే అతని గురితప్పడంతో నారంగ్ 23వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. పది మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్ ఈరోజు రాత్రి 8.30 గంటలకు జరగనుంది.