Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రియో 2016: 8 గంటల్లో 2లక్షల 40వేల టికెట్లు అమ్మకం

రియో డి జనీరో: రియో ఒలింపిక్స్ సందడి మొదలైంది. వచ్చే ఏడాది బ్రెజిల్ రాజధాని రియో డి జనీరోలో నిర్వహించనున్న ఒలింపిక్స్ టికెట్లను అభిమానులు పోటీపడి కొంటున్నారు. ఆన్‌లైన్‌లో టికెట్ అమ్మకాలను ప్రారంభించారు. టికెట్ల అమ్మకాలు ప్రారంభించిన తొలి గంటకే 1.2 లక్షల టికెట్ల విక్రయాలు జరిగాయని నిర్వాహకులు తెలిపారు.

అందులో ఎక్కువగా ఫుట్‌బాల్‌, వాలీబాల్‌, బాస్కెట్‌ బాల్‌ మ్యాచ్‌ల టికెట్లకు డిమాండ్ బాగా ఉందని చెప్పారు. ఇది ఇలా ఉంటే 8 గంటల్లో 2లక్షల 40వేల టికెట్లు అమ్ముడయ్యాయి. 20లక్షల టికెట్లను బ్రెజిల్‌ వాసుల కోసం మూడో దశలో అమ్మకానికి ఉంచినట్లు తెలిపారు.

 Rio 2016 sells 240,000 tickets in eight hours

బ్రెజిల్ కోసం రెండు లక్షల టికెట్లు కేటాయించామని, తొలి రెండు లక్షల మందికి మాత్రమే ఈ అవకాశం అభిస్తుందని నిర్వాహకులు తెలిపారు. రియో డి జనీరో, సావో పోలో, మినాస్ గెరేస్, పరానా పట్టణ ప్రజలు టికెట్లు కొనుగోలులో అగ్రస్థానంలో ఉన్నారు.

రియో ఒలింపిక్స్-2016లో మొత్తం 518 గేమ్స్ ఉన్నాయి. కాగా ఇతర దేశాల వారు మాత్రం అధికారిక విక్రయదారుల నుంచి మాత్రమే టికెట్లు కొనుగోలు చేయాలని ఈవెంట్ ఆర్గనైజర్స్ సూచించారు. వచ్చే ఏడాది ఆగస్టులో జరిగే ఈ ఒలింపిక్స్‌ దక్షిణ అమెరికాలో జరుగుతున్న తొలి ఒలింపిక్స్‌ కావడం విశేషం.

Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+