రియో డీ జెనిరో: రియో ఒలింపిక్స్ 2016లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. త్రీ మీటర్ స్ప్రింగ్ బోర్డు డైవింగ్ పోటీల్లో చైనా క్రీడాకారిణి హెజీ (25) సిల్వర్ మెడల్ సాధించింది. ఈ సమయంలో లైవ్ కెమెరాలకు చైనాకే చెందిన డైవింగ్ ఆటగాడు కిన్ కై (30) పెళ్లి ప్రపోజల్ తెచ్చాడు. దానికి ఆమె ఓకే చెప్పింది.
చైనాకు చెందిన వీరిద్దరు (ప్రపోజ్ చేసిన యువకుడు క్వీన్ కాయ్, యువతి హెజీ) డైవింగ్ పోటీల్లో పాల్గొన్నారు. మహిళల డైవింగ్ 3 మీ. స్ప్రింగ్ బోర్డు విభాగంలో హిజీ రజతం గెలిచి పతకం గెలిచింది.

దానిని ఆమె తీసుకుంటున్న సమయంలో అక్కడికి క్వీన్ కాయ్ చేరుకున్నాడు. పతకం తీసుకొని పోడియం దిగగానే ఆమె వద్దకు వెళ్లి మోకాళ్ల పైన కుర్చొని బంగారు ఉంగరాన్ని చూపించి పెళ్లి చేసుకుందామా.. అని ప్రపోజ్ చేశాడు. దీంతో ఆశ్చర్యం, ఆనందానికి గురైన ఆమె ఆనందబాష్పాలతో ప్రియుడిని హత్తుకొని ఓకే అన్నది.
దీనిపై ప్రియురాలు హెజి మాట్లాడుతూ.. తామిద్దరం ఆరేళ్లుగా డేటింగ్ చేస్తున్నామని చెప్పింది. అయితే, ఈ రోజు అతను తనకు ప్రపోజ్ చేస్తాడని ఎప్పుడు కూడా ఊహించలేదని చెప్పింది. అతను తనకు ఎన్నో చెప్పాడని కానీ, ఇప్పుడు అతను చేసినది తన గుండెకు మరింత తాకిందని చెప్పింది. అతనిని జీవితాంతం విశ్వసిస్తానని చెప్పింది.