రియో డి జెనిరో: రియో ఒలింపిక్స్ 2016 ఫైనల్ నేపథ్యంలో దీపా కర్మాకర్ అన్నింటికి దూరంగా ఉంటున్నారు. ఓ విధంగా తనను తాను హౌస్ అరెస్ట్ చేసుకుంటున్నారని చెప్పవచ్చు. ఆమె తన ఫోన్ నుంచి సిమ్ కార్డ్ తొలగించింది. కేవలం తల్లిదండ్రులతోనే మాట్లాడనుంది. కేవలం పైనల్ పైనే దృష్టి సారించింది. ఆమె కోచ్ ఫైనల్ పైనే దృష్టి పెట్టేలా చేస్తున్నారు.
తన మొబైల్ నుంచి సిమ్ కార్డు తొలగించానని, కేవలం తల్లిదండ్రులతోనే మాట్లాడనిస్తున్నానని, ఆమె పూర్తిగా ఫైనల్ పైన దృష్టి సారించేలా చూస్తున్నానని కోచ్ చెప్పారు.

ప్రస్తుతం తన పైన ఎలాంటి ఒత్తిడి లేదని చెప్పింది. స్టేడియంలో వీక్షకుల అరుపులు, ఫ్లోర్ మీద మ్యూజిక్, దేశ ప్రజలు చూస్తుంటారనే భావనల మధ్య ప్రదర్శన చేశానని, చివరలో ఫైనల్ చేరిన జిమ్నాస్ట్‌ల జాబితా ప్రకటన కోసం చాలా సేపు ఎదురు చూడాల్సి వచ్చిందని తెలిపింది.
ఆ సమయంలో తీవ్ర ఒత్తిడికి గురయ్యానని, అయితే ఎనిమిదో స్థానంలో నిలిచి ఫైనల్‌కి చేరడం చాలా ఆనందాన్ని ఇచ్చిందని తెలిపింది. తుది పోరులో కొరియా, అమెరికా, రష్యా జిమ్నాస్ట్‌ల నుంచి గట్టి పోటీ ఎదురుకానుందని, అయితే క్వాలిఫయింగ్ ముందు మాత్రమే ఒత్తిడి ఉండేదని, ఇప్పుడు లేదని తెలిపింది. ఫైనల్లో సాధ్యమైనంత వరకు మెరుగైన ప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తానని తెలిపింది.