
అభినవ్ బింద్రా
పురుషుల 10 మీటర్ల యిర్ రైఫిల్ ఫైనల్లో షూటర్ అభినవ్ బింద్రా త్రుటిలో కాంస్యం గెలిచే అవకాశం కోల్పోయాడు.

హాకీ టీం
ఒలింపిక్స్‌లో భాగంగా సోమవారం నాడు.. భారత హాకీ టీం జర్మనీ చేతిలో 1-2 తేడాతో ఓడిపోయింది. కచ్చితంగా డ్రా అవుతుందన్ననుకున్న మ్యాచ్‌లో శ్రీజేష్ సేన ఆఖరి మూడు సెకన్లలో గోల్ ఇచ్చి ఓడిపోయింది. 18వ నిమిషంలో వాలెన్ కొట్టిన గోల్‌తో జర్మనీ ఆధిక్యంలో నిలిచింది. అయితే కాసేపటికే రూపీందర్‌పాల్ సింగ్ పెనాల్టీకార్నర్‌ను గోల్‌గా మలిచి స్కోరు 1-1తో సమం చేశాడు. చాలా సందర్భాల్లో గోల్స్ త్రుటిలో తప్పాయి. మరో మూడు సెకన్లలో మ్యాచ్ ముగుస్తుందనగా క్రిస్టఫర్ రూర్ గోల్ చేసి జర్మనీని గెలిపించాడు.

స్విమ్మర్స్
స్విమ్మింగ్‌లో భారత స్విమ్మర్లు విఫలమయ్యారు. పురుషుల 200 మీటర్ల బటర్‌ఫ్లైలో సాజన్ ప్రకాశ్ 1:59.37 సెకన్లలో లక్ష్యాన్ని చేరి హీట్స్‌లో నాలుగో స్థానంలో నిలిచాడు. మొత్తం మీద అతను 41వ స్థానంతో సరిపెట్టుకున్నాడు.

స్విమ్మర్స్
మహిళల 200 మీటర్ల ఫ్రీస్టయిల్‌లో శివాని కటారియా 28వ ర్యాంకులో నిలిచింది. హీట్స్‌లో ఆమె 2:09.30 నిమిషాల్లో లక్ష్యాన్ని చేరి రెండో స్థానంలో నిలిచింది.

మహిళల హాకీ
రియో ఒలింపిక్స్‌లో భారత హాకీ మహిళల జట్టు బ్రిటన్‌పై 0-3 తేడాతో పరాజయం పాలైంది. మొదటి క్వార్టర్‌లో 0-0తో నిలిచిన భారత్ రెండో క్వార్టర్‌లో బ్రిటన్‌కు రెండు పెనాల్టీ షూటౌట్‌లను ఇవ్వడంతో ఆ జట్టు 2-0తో అధిక్యంలోకి వెళ్లింది. మూడో క్వార్టర్‌లోనూ భారత డిఫెన్స్ విఫలమవ్వడంతో మరో గోల్‌ను సమర్పించుకుంది. నా��ుగో క్వార్టర్‌లో భారత్‌కు ఓ పెనాల్టీ షూటౌట్ అవకాశం వచ్చినా గోల్‌గా మలచడంలో భారత్ విఫలమైంది. దీంతో భారత్‌కు ఓటమి తప్పలేదు.


Click it and Unblock the Notifications











