Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

విండీస్ ఉతికి ఆరేసిన గుప్తిల్, డబుల్ సెంచరీ: గేల్ రికార్డు బద్దలు

వెల్లింగ్టన్‌: ఐసిసి ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా శనివారం జరుగుతున్న క్వార్టర్ ఫైనల్ మ్యాచులో న్యూజిలాండ్ ఓపెనర్ వెస్టిండీస్ బౌలర్లను ఉతికి ఆరేశాడు. డబుల్ సెంచరీతో చెలరేగాడు. ప్రపంచ కప్ పోటీల్లో గుప్తిల్ చేసిన డబుల్ సెంచరీ రెండోది. అదే సమయంలో మైదానంలో ఉన్న క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టాడు. ప్రపంచ కప్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ఆటగాడిగా గుప్తిల్ రికార్డు సృష్టించాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు గేల్ పేర ఉంది.

నాలుగు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద గుప్తిల్ ఇచ్చిన క్యాచ్‌ను మార్లోన్ శామ్యూల్ జార విడిచాడు. దానికి కివీస్ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. వన్డే చరిత్రలో గుప్తిల్‌ది ఆరో డబుల్ సెంచరీ. అతను రెండో స్థానాన్ని అక్రమించాడు. భారత్‌కు చెందిన రోహిత్ శర్మ 264 వ్యక్తిగత స్కోరుతో అగ్రస్థానంలో ఉన్నాడు.

ఓ బ్యాట్స్‌మన్ ప్రపంచ కప్ పోటీల్లో 200లకు పైగా పరుగులు చేయడం ఇదే రెండోది. జింబాబ్వేపై క్రిస్ గేల్ డబుల్ సెంచరీ చేశాడు. ఇన్నింగ్సు 48వ ఓవరులో గుప్తిల్ ఆ రికార్డును సాధించాడు. వెల్లింగ్టన్ రీజినల్ స్టేడియంలో గుప్తిల్ పరుగులు వరద పారించాడు. 11 సిక్స్‌లు, 24 ఫోర్లతో గుప్తిల్ 237 పరుగులు చేసి వెస్టిండీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.

Record: Guptill smashes World Cup's highest ever score, surpasses Gayle

వన్డే క్రికెట్‌లో నమోదైన డబుల్ సెంచరీలు

264 - శ్రీలంకపై రోహిత్ శర్మ (2014)

237 - వెస్టిండీస్‌పై మార్టిన్ గుప్తిల్ (2015)

219 - వెస్టిండీస్‌పై వీరేంద్ర సెహ్వాగ్ (2011)
215 - జింబాబ్వేపై క్రిస్ గేల్ (2015)
209 - ఆస్ట్రేలియాపై రోహిత్ శర్మ (2013)
200 - దక్షిణాఫ్రికాపై సచిన్ టెండూల్కర్ (2010)

ప్రపంచ కప్ పోటీల్లో డబుల్ సెంచరీలు

215 - క్రిస్ గేల్
237 - మార్టిన్ గుప్తిల్

Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+