Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గోల్డెన్ ‘సిక్స్’తో బెంగూళూరు సెమీస్ బెర్త్ ఖాయం!!

Banglore royal challengers
ఫ్లడ్ లైట్ల వెలుతురులో ఉత్కంఠభరిత పొట్టి క్రికెట్ అనుభూతిని మరో మారు అభిమానులు రుచిచూశారు. నాలుగు గంటల నాన్‌స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్‌లో అంతిమంగా క్రికెట్ నెగ్గింది. సెమీస్ బెర్త్ కోసం రెడ్ బ్యాక్స్, రాయల్ ఛాలెంజర్స్ మధ్య బుధవారం బెంగుళూరులో జరిగిన చాంపీయన్స్ టీ20 లీగ్ దశ చివరి పోరు క్రీడా స్పూర్తిని చాటింది. 'రెడ్‌బ్యాక్స్" ముందుంచిన 218 పరుగుల భారీ లక్ష్యాన్ని అనూహ్య రీతిలో రాయల్ ఛాలెంజర్స్ జట్టు చేధించింది. మ్యాచ్ చివరి బంతిని సిక్స్‌గా మళ్లించిన 'అరుణ్ కార్తీక్" జట్టు మెరుపు విజయానికి దోహదపడ్డాడు.


టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న 'రెడ్‌బ్యాక్స్" నీర్ణతే 20 ఓవర్లలో 214లు సాధించంది. ఓపెనర్ హారిస్ మెరపు షాట్లతో 108 పురుగులు సాధించి నాటౌట్‌గా నిలవగా, మరో బ్యాట్సమెన్ ఫెర్గూసన్ 70 పరుగులు సాధించి జట్టుకు తన సహకారాన్ని అందించాడు. 215 పరుగుల లక్ష్య చేధనలో భాగంగా బ్యాటింగ్ ఆరంభించిన ఛాలెంజర్స్ జట్టు ఆరంభం నుంచే స్కోర్ బోర్డును పరిగెత్తించింది. ఓపెనర్ క్రిస్ గేల్ 26 పరుగులు సాధించి వెనుతిరిగినప్పటికి, విరాట్ కోహ్లీ (70), తిలకరత్నే దిల్షాన్ (74)లు సౌత్ ఆస్ట్రేలియా బౌలర్ల పనిపట్టారు. బెంగూళూరు జట్టుకు దాదాపు విజయం ఖాయమనుకున్న తరుణంలో బౌలర్ షాన్ టైట్ విరుచుకుపడ్డాడు, ఒకే ఓవర్లో మూడు వికెట్లు పడగొట్టి రాయల్ ఛాలెంజర్స్ ఆశలను గల్లంతు చేశాడు. చివరి బంతికి ఆరు పరుగులు కావల్సి ఉండగా, డానియల్ క్రిస్టియన్ వేసిన బంతిని అరుణ్ కార్తీక్ మిడ్ వికెట్ దిశగా సిక్సర్ బాది ఛాలెంజర్స్ సెమీస్ మార్గాన్ని సుగమం చేశాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+