Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆ ఇద్దర్నీ పక్కన పెట్టండి- గెలుపు మీదే: టీమిండియా మాజీ ఆల్ రౌండర్

ఐపీఎల్ లో నేడు మరో కీలక మ్యాచ్ జరుగనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. కోల్ కత నైట్ రైడర్స్ తో తలపడబోతోంది. ఈ సాయంత్రం 7:30 గంటలకు రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియం దీనికి వేదిక. ఈ రెండు జట్లకూ కీలక మ్యాచ్ ఇది. ఇందులో గెలిస్తే.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తన ప్లేఆఫ్స్ కు మరింత చేరువ అవుతుంది. గెలిచినా కేకేఆర్ కు పెద్దగా ఉపయోగపడకపోవచ్చు.

ఈ పరిస్థితుల్లో టీమిండియా మాజీ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్.. ఆర్సీబీకి కొన్ని సూచనలు చేశాడు. తన యూట్యూబ్ వీడియోలో దీనికి సంబంధించిన ఓ వీడియో పోస్ట్ చేశాడు. న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ జాకబ్ డఫ్ఫీ, ఆల్‌రౌండర్ వెంకటేష్ అయ్యర్‌ను జట్టులోకి తీసుకోవాలని అభిప్రాయపడ్డాడు. ఈ పరిస్థితులలో వీరిద్దరూ జట్టుకు ఉపయోగపడతారని పేర్కొన్నాడు. లెగ్ స్పిన్నర్ సుయాష్ శర్మ, ఫామ్‌లో లేని ఆల్‌రౌండర్ రొమారియో షెపర్డ్ స్థానంలో వీరు బరిలోకి దిగాలని సూచించాడు.

Ravichandran Ashwin pitches two changes for RCB vs KKR Duffy and Iyer in Suyash and Shepherd out

ఆర్సీబీలో మరో ఫాస్ట్ బౌలర్‌ అవసరం ఉందని, ఆ స్థానాన్ని జాకబ్ డఫీ భర్తీ చేయగలడని చెప్పాడు. ఆల్ రౌండర్ వెంకటేష్ అయ్యర్ ను తుదిజట్టులోకి తీసుకుంటే.. ఏ స్థానంలో అయినా అతన్ని దించవచ్చని అన్నాడు. సుయాష్ శర్మ లేదా రొమారియో షెపర్డ్‌ను పక్కన పెట్టాలని పేర్కొన్నాడు. ఈ సీజన్ ప్రారంభంలో జోష్ హాజిల్‌వుడ్ అందుబాటులో లేనప్పుడు డఫ్ఫీ ఆర్సీబీ తరఫున ఆడాడు. రాణించాడు. అదే విషయాన్ని అశ్విన్ గుర్తు చేశాడు.

ఇప్పటివరకు డఫ్ఫీ మూడు ఇన్నింగ్స్‌లలో ఆరు వికెట్లు పడగొట్టారు. ఎకానమీ రేటు 11.50గా నమోదైంది. మరోవైపు వెంకటేష్ అయ్యర్‌ను రెండు సందర్భాలలో ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఉపయోగించారు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 15 బంతుల్లో 29 (నాటౌట్), గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 15 బంతుల్లో 12 పరుగులు చేశాడు. వీరిద్దరూ కేకేఆర్ తో జరిగే మ్యాచ్, పిచ్ పరిస్థితులకు చక్కగా సరిపోతాడని అశ్విన్ అంచనా వేశాడు.

డిఫెండింగ్ ఛాంపియన్‌ ఆర్సీబీని ఓడించాలంటే కేకేఆర్ అద్భుతంగా ఆడాలని అశ్విన్ అన్నాడు. కేకేఆర్ కు బలమైన ఫాస్ట్ బౌలింగ్ లైనప్ లేదపి. వారు గెలవాలంటే అసాధారణంగా ఆడాల్సి ఉంటుందని తేల్చి చెప్పాడు. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీదే పై చేయి అని తాను భావిస్తున్నానని అన్నాడు.

Story first published: Wednesday, May 13, 2026, 14:12 [IST]
Other articles published on May 13, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+