Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఊరట: రేప్ అభియోగాల నుంచి పింకీకి విముక్తి

Rape Charge Against Pinki Pramanik Dropped by Calcutta High Court
కోల్‌కతా: పింకీ ప్రామాణిక్‌కు అత్యాచారం అభియోగాల నుంచి విముక్తి లభించింది. ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత పింకీ ప్రామాణిక్‌పై మోపిన అన్ని అభియోగాలను కలకత్తా హైకోర్టు తోసిపుచ్చింది. పింకీ ప్రామాణిక్ మహిళ కాదని, మగాడని, తనపై అత్యాచారం చేశాడని లైవ్ ఇన్ పార్ట్నర్ అనామిక ఆచార్య ఆరోపణలు చేశారు. దీంతో పోలీసులు 2012 జూన్ 14వ తేదీన పింకీని అరెస్టు చేశారు.

పోలీసులు పింకీని తమ కస్టడీలోకి తీసుకుని 25 రోజుల పాటు విచారించారు. లైంగిక నిర్ధారణ కోసం లింగ నిర్ధారణ పరీక్షలకు కూడా పింకీ సిద్దపడాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఆమె తనపై వచ్చిన అభియోగాలపై హైకోర్టుకు ఎక్కారు.

పింకీపై మోపిన అన్ని అభియోగాలను కొట్టి వేస్తున్నట్లు, చార్జిషీట్‌ను తోసిపుచ్చుతున్నట్లు జస్టిస్ సుబ్రతా తాలూక్దార్ శుక్రవారం స్పష్టం చేశారు. పింకీ ప్రామాణిక్‌ను పురుషుడిగా పరిగణించి పోలీసులు కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+