For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కామన్వెల్త్‌కు దూరం: రేప్ కేసు ఎదుర్కొంటున్న సౌమ్యజిత్‌పై వేటు

By Nageshwara Rao
Rape-accused Soumyajit Ghosh suspended, out of CWG

హైదరాబాద్: అందరూ ఊహించిందే జరిగింది. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న టేబుల్‌ టెన్నిస్‌ ఆటగాడు సౌమ్యజిత్‌ ఘోష్‌ను కామన్వెల్త్‌ బృందం నుంచి తప్పించారు. అంతేకాదు అతడిపై తాత్కాలిక సస్పెన్షన్‌ వేటు కూడా వేశారు.ఈ మేరకు భారత టీటీ సమాఖ్య (టీటీఎఫ్‌ఐ) శుక్రవారం ప్రకటన విడుదల చేసింది.

నెల జీతం సరిపోవడం లేదు: చిన్నారి కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదన

'సౌమ్యజిత్‌పై టీటీఎఫ్‌ఐ కార్యనిర్వాహక బోర్డు తాత్కాలిక సస్పెన్షన్‌ విధించింది. పోలీస్‌ విచారణ అనంతరం కోర్టు తీర్పును అనుసరించి బోర్డు తుది నిర్ణయం తీసుకుంటుంది. ఈ నిషేధం ఉన్నంత కాలం అతను జాతీయ, అంతర్జాతీయ టోర్నీల్లో ఆడడానికి వీల్లేదు. మీడియా నివేదికలు, ఎఫ్‌ఐఆర్‌ ప్రకారం బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. వచ్చే కామన్వెల్త్‌ క్రీడులకు అతను అనర్హుడు' అని టీటీఎఫ్‌ఐ ప్రకటనలో తెలిపింది.

అసలేం జరిగింది?
సౌమ్యజిత్‌ ఘోష్‌ తనను మోసం చేసి లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ 18 ఏళ్ల యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. 'గత మూడేళ్లుగా ఘోష్‌ నేను రిలేషన్‌లో ఉన్నాం. ఆ సమయంలో అతడు నాపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. నన్ను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడు. కానీ, ఆ తర్వాత నిరాకరించాడు' అంటూ బాధితురాలు పోలీసులకు తెలిపింది.

కొత్త AI powered cameraతో OPPO F7, 25 ఎంపీ AI సెల్ఫీ కెమెరాతో..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘోష్‌ సదరు యువతిని సోషల్‌ మీడియా ద్వారా 2014లో కలుసుకున్నాడు. అప్పటి నుంచి ఆమెతో సంబంధాలు కొనసాగించాడు. తరుచుగా కోల్‌కతాలోని ఘోష్‌ ప్లాట్‌లో, తన స్వగ్రామమైన సిలిగురిలోని ఫ్లాట్‌లో వారిద్దరు కలుసుకునేవారు. ఓసారి ఆమె గర్భవతి కూడా అయిందని, బలవంతంగా అబార్షన్‌ కూడా చేయించాడని సమాచారం.

అంతేకాదు, వీరిద్దరు అనధికారికంగా ఓ ఆలయంలో వివాహం కూడా చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఆ పెళ్లిని అతడు అంగీకరించడం లేదంట. బరాసత్‌ మహిళా పోలీస్‌ స్టేషన్‌లో ఈ మేరకు బాధితురాలు కేసు పెట్టింది. 24 ఏళ్ల ఘోష్‌ 2012, 2016 ఒలింపిక్స్‌లో భారత్‌ తరపున పాల్గొన్నాడు.

19 ఏళ్లకే 74వ జాతీయ టెన్నిస్‌ ఛాంపియన్‌షిప్‌లో టైటిల్‌ను గెలుచుకున్న అతి చిన్న వయస్కుడిగా అరుదైన ఘనత సాధించాడు. మరోవైపు తనపై వచ్చిన ఆరోపణలను ఘోష్ ఖండించాడు. యువతిపై లైంగిక దాడికి పాల్పడినట్లు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని తేల్చేశాడు. అంతేగాక, తనను కావాలనే సదరు యువతి బ్లాక్‌మెయిల్‌ చేస్తూ రేప్‌ ఆరోపణలకు దిగినట్లు ఘోష్‌ తెలిపాడు.

Story first published: Saturday, March 24, 2018, 15:58 [IST]
Other articles published on Mar 24, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+