వరల్డ్ ఛాంపియన్ మాగ్నస్ కళ్లు బైర్లు కమ్మేలా ప్రజ్ఞానందా ఎత్తు.. కుర్రాడు బాబోయ్, ఆనంద్ మహీంద్రా ట్వీట్..!

17ఏళ్ల భారత చెస్ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానందా రమేష్‌బాబు కేవలం ఆరు నెలల్లో మూడోసారి ప్రపంచ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్‌సెన్‌ను ఓడించాడు. మియామీలో జరిగిన ఛాంపియన్స్ చెస్ టూర్ అమెరికన్ ఫైనల్ అయిన FTX క్రిప్టో కప్‌లో సోమవారం ప్రజ్ఞానందా .. మాగ్నస్ కార్ల్ సెన్‌ను ఖంగు తినిపించాడు. ప్రజ్ఞానందా ఎత్తులకు చిత్తయిన మాగ్నస్ కార్ల్‌సెన్ మతిభ్రమంచే ఉండొచ్చు. వెంటనే ఒక్కసారి సీట్లో నుంచి ఎగిరి ఓడమ్మా ఇదేం ఎత్తురా అని ఇంగ్లీష్లో అనుకున్నాడు. కార్ల్‌సెన్ దాదాపు గేమ్ గెలిచేందుకు అంచుల్లో ఉండగా.. అతను చేసిన చిన్నతప్పును ప్రజ్ఞానందా గట్టిగా పట్టుకుని మతి పోయే ఎత్తు వేశాడు. దీంతో మాగ్నస్ కార్ల్ సెన్ వద్ద బదులు లేకపోయింది.
ఇకపోతే మాగ్నస్ కార్ల్ సెన్ ఈ ఈవెంట్లో అందరికంటే అధిక స్కోరు ఆధారంగా టైటిల్ విజేత అయ్యాడు. అయితే అతనికి ప్రజ్ఞానందా ను ఓడించడం మాత్రం సాధ్యం కాలేదు. ఇక ప్రజ్ఞానందా రెండో స్థానంలో నిలిచాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో.. ఆన్‌లైన్ ఛాంపియన్‌షిప్‌లో ప్రపంచ నంబర్ 1 కార్ల్‌సెన్‌ను ప్రజ్ఞానందా తొలిసారి ఓడించాడు. ఆ తర్వాత ఎయిర్‌థింగ్స్ మాస్టర్స్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్‌లో మరోసారి ఓడించాడు. ఇకపోతే 2016లో 10 ఏళ్ల వయసులో అంతర్జాతీయ మాస్టర్‌గా అవతరించిన ప్రజ్ఞానందా అత్యంత తక్కువ వయసులో అత్యంత మాస్టర్ ట్యాగ్ అందుకున్న ప్లేయర్‌గా రికార్డు కూడా నెలకొల్పాడు.
ఇక ప్రజ్ఞానందా విజయంపై ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా సైతం స్టన్ అయిపోయాడు. ఇక ప్రజ్ఞానందా కు సంబంధించిన ఓ ఫోటోను పోస్టు చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆ కుర్రాడని చూడండి.. అతని ముఖంలో తీవ్రమైన పట్టుదలను గమనించండి. చదరంగం అనేది సింహాసనాల ఆట అయితే.. త్వరలో సింహాసనాన్ని అధిరోహించే వ్యక్తిగా ప్రజ్ఞానందా కావొచ్చు. మనమందరం అతని పేరును ఎలా సరిగ్గా రాయాలో కూడా నేర్చుకోవాలి. గుర్తుంచుకోండి' అంటూ ట్వీట్ చేశాడు.
Story first published: Monday, August 22, 2022, 16:29 [IST]
Other articles published on Aug 22, 2022
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications