యువీపై వ్యాఖ్యలు చేయలేదు: రాజపూత్
సిడ్నీ: తమ జట్టులో గొడవలు లేవని భారత క్రికెట్ జట్టు మేనేజర్ లాల్ చంద్ రాజపూత్ స్పష్టం చేశారు. యువరాజ్ ప్రవర్తనపై తానేమీ వ్యాఖ్యానించలేదని ఆయన అన్నారు. యువరాజ్ ప్రవర్తనపై వ్యాఖ్యలు చేసినట్లు వార్తలు రావడంతో ఆయన పరిస్థితిని చక్కదిద్దే పనికి పూనుకున్నారు. మెల్బోర్న్ లో భారత్ ఓడిపోయినటప్పటికీ సిడ్నీలో సత్తా చాటుతుందని ఆయన చెప్పారు. ఆస్ట్రేలియాను ఓడించడానికి గేమ్ ప్లాన్ సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు.
రాహుల్ ద్రావిడ్ మెల్బోర్న్ లో సరిగా ఆడకపోయినప్పటికీ పెద్దగా ఆందోళన చెందాల్సిందేమీ లేదని, ద్రావిడ్ ఫామ్ లోకి వస్తాడని ఆయన అన్నారు. టీం ఇండియాలో గొడవలపై వచ్చిన వార్తలను భారత క్రికెట్ జట్టు మీడియా మేనేజర్ ఎం.వి. శ్రీధర్ ఖండించారు.
Story first published: Monday, December 31, 2007, 23:53 [IST]
Other articles published on Dec 31, 2007
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications