Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బుకీతో బీసీసీఐ సెక్రటరీకి లింకులు: ఎలాంటి ఆధారాలేవన్న ఐపీఎల్ ఛైర్మన్ శుక్లా

న్యూఢిల్లీ: బీసీసీఐ సెక్రటరీ అనురాగ్ ఠాకూర్‌కు బుకీలతో సంబంధాలున్నాయని అనడానికి ఎలాంటి ఆధారాల్లేవని ఐపీఎల్ పాలకమండలి ఛైర్మన్ రాజీవ్ శుక్లా అన్నారు. అనురాగ్ ఠాకూర్ క్రికెట్ బుకీ కరణ్ గిల్హోత్రాతో కలిసి పార్టీలో కనిపించాడంటూ వచ్చిన వార్తలపై ఆయన సోమవారం స్పందించారు.

ఈ విషయంపై విచారణకు డిమాండ్ చేస్తారా? అన్న ప్రశ్నకు 'ఈ విషయంపై నా దగ్గర ఎలాంటి సమాచారం లేదు. నాకు తెలిసినప్పడు, తప్పక మట్లాడతాను. నిజం గురించి నాకు ఇంకా తెలియదు. అయితే ఆధారాలేవైనా దొరికిన తర్వాతే దీనిపై వ్యాఖ్యానిస్తాను' అని స్పష్టం చేశారు.

ఇక బీజేపీ నేత, టీమిండియా మాజీ క్రికెటర్ కీర్తీ అజాద్ ఈ వ్వవహారంపై స్పందిస్తూ, బుకీలతో అనురాగ్ ఠాకూర్‌కు లింకులున్నట్లు విడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. ఠాకూర్‌కి అలాంటి వ్యక్తులతో సంబంధాలున్నాయంటే నేను నమ్మనని పేర్కొన్నారు.

rajeev shukla

ఇక నాలుగు రోజుల క్రితం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సీఈఓ రిచర్డ సన్, బీసీసీఐ సెక్రటరీ అనురాగ్ ఠాకూర్ బుకీ కరణ్ గిల్హోత్రాతో కలిసి పార్టీలో కనిపించాడంటూ వచ్చిన వార్తలపై చర్యలు తీసుకోవాలని బీసీసీఐ అధ్యక్షడు జగ్మోహాన్ దాల్మియాకు లేఖ రాశారు.

ఆ పార్టీలో అనురాగ్ ఠాకూర్ కట్ చేసిన కేక్‌ను ఐసీసీ యాంటీ కరప్షన్ నిషేధిత జాబితాలో ఉన్న కరణ్ గిల్హోత్రాకు ఆఫర్ చేసిన ఫోటోలను ఐసీసీకి ఓ అంతర్జాతీయ జర్నలిస్ట్ పంపినట్లు తెలుస్తోంది. అయితే బీసీసీఐ అధ్యక్షుడు జగ్మోహాన్ దాల్మియా ఈ విషయాన్ని అసలు పట్టించుకోలేదంట.

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+