Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

శ్రీలంకపై గంభీర్ సెంచరీ: మ్యాచ్ రద్దు

Gotam Gambhir
బ్రిస్బేన్: వర్షం కారణంగా శ్రీలంక, భారత్ ల మధ్య వన్డే క్రికెట్ మ్యాచ్ రద్దయింది. భారత్ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత లంచ్ విరామ సమయంలో వర్షం ప్రారంభమైంది. ఆ తర్వాత ఎంతకీ వర్షం తెరిపినివ్వకపోవడంతో మ్యాచ్ ను రద్దు చేశారు. దీంతో శ్రీలంక, భారత్ లకు చెరో రెండు పాయింట్లు వచ్చాయి. ఆస్ట్రేలియా, భారత్ ల మధ్య జరిగిన వన్డే మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దయింది. తాను ఆడిన రెండు వన్డేలు రద్దు కావడంతో భారత్ కు నాలుగు పాయింట్లు వచ్చాయి. అంతకు ముందు కామన్వెల్త్ ముక్కోణ వన్డే సిరీస్‌లో భాగంగా బ్రిస్బేన్‌లో మంగళవారం జరిగే వన్డేలో శ్రీలంకకు 268 పరుగుల లక్ష్యాన్ని భారత్ నిర్ణయించింది. ఓ దశలో 83 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన భారత్‌ను గంభీర్, ధోనిలు ఆదుకున్నారు.

వారిద్దరూ ఐదో వికెట్‌కు అజేయంగా 184 పరుగులు జోడించడంతో భారత్ పటిష్ట స్కోరు చేయగలిగింది. గంభీర్ 102, ధోని 88 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. అంతకు ముందు టాస్ గెలిచిన ధోనీ బ్యాటింగ్ ఎంచుకోగా, సచిన్ (33), సెహ్వాగ్ (35)‌లు తొలి వికెట్‌కు 63 పరుగులు జోడించడం ద్వారా శుభారంభం అందించారు. ఆ తర్వాత 20 పరుగుల వ్యవధిలో వెంటవెంటనే నాలుగు వికెట్లు కోల్పోవడంతో భారత్ కష్టాల్లో చిక్కుకుంది. సచిన్, సెహ్వాగ్‌లతో పాటు యువరాజ్ (2), రోహిత్ శర్మ (0)లు కూడా పెవిలియన్ బాట పట్టారు. మురళీధరన్ తన తొలి ఓవర్లోనే ఇద్దరిని అవుట్ చేయడంతో తడబడిన భారత్‌ను ధోనీ, గంభీర్‌లు తమ సమయస్ఫూర్తి ప్రదర్శనతో ఆదుకున్నారు. తొలుత ఆచితూచి ఆడుతూ వచ్చిన గంభీర్, ధోనీలు ఆట ముందుకు సాగే కొద్దీ విజృంభించడంతో భారత్‌కు భారీ స్కోరు సాధ్యమైంది.
Story first published: Tuesday, February 5, 2008, 17:23 [IST]
Other articles published on Feb 5, 2008
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+