Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్రజ్ఞానంద అద్భుత విజయం.. తొలి భారతీయుడిగా ఘనత!

భారత గ్రాండ్‌మాస్టర్‌ ఆర్‌.ప్రజ్ఞానంద మరోసారి తన సత్తా నిరూపించాడు. టాటా స్టీల్‌ చెస్‌ మాస్టర్స్ లో ఛాంపియన్ గా నిలిచాడు. థ్రిల్లింగ్ గా సాగిన టై బ్రేకర్‌లో వరల్డ్‌ ఛాంపియన్‌ గుకే‌ష్ పై ప్రజ్ఞానంద గెలిచాడు. 2-1 తేడాతో గెలుపొంది టైటిల్ ను ఖాతాలో వేసుకున్నాడు. ఈ విజయంతో.. 2006 ( అప్పుడు విశ్వనాథన్ ఆనంద్ విజేత) తర్వాత టాటా స్టీల్ మాస్టర్స్ లో టాప్ ప్రైజ్ అందుకున్న తొలి భారతీయుడిగా నిలిచాడు.

అంతకుముందు తమ చివరి 13వ రౌండ్ లో గుకేశ్, ప్రజ్ఞానంద.. ఇద్దరూ ఓటమిని అందుకున్నారు. తెలంగాణ గ్రాండ్‌మాస్టర్‌ అర్జున్‌ చేతిలో గుకేష్ కంగుతినగా.. విన్సెంట్‌ కీమర్‌ చేతిలో ప్రజ్ఞానంద పరాజయం పొందాడు. దీంతో గుకేష్‌, ప్రజ్ఞానంద తలో 8.50 పాయింట్లతో సమంగా నిలిచారు. తద్వారా టైటిల్ కోసం రెండు గేమ్‌ల టై బ్రేకర్ లో ఆడారు. ఇందులో మొదటి టై బ్రేకర్ లో గుకేష్‌ విజయం సాధించగా.. రెండో ట్రై బ్రేకర్ లో ప్రజ్ఞానంద గెలుపును సొంతం చేసుకున్నాడు. ఈ రెండు రౌండ్లు చెరో మూడు నిమిషాల పాటు సాగింది. అనంతరం విజేతను తేల్చేందుకు మళ్లీ సడన్‌ డెత్‌ రౌండ్ నిర్వహించాల్సి రాగా.. ఇందులో ప్రజ్ఞానంద విజయం సాధించి టైటిల్ ను ముద్దాడాడు.

R Praggnanandhaa Defeats World Champion D Gukesh to won Tata Steel Masters Title

ఇక టాటా స్టీల్ ఛాలెంజర్స్ 2025లో వియాత్నంకు చెందిన థాయ్ దాయ్ నుగెన్ విజేతగా నిలిచాడు. ప్రజ్ఞానంద సోదరి ఆర్ వైశాలి 9వ స్థానంలో నిలవగా.. దివ్య దేశ్ ముఖ్ 12వ స్థానంలో సరిపెట్టుకుంది.

Story first published: Monday, February 3, 2025, 9:33 [IST]
Other articles published on Feb 3, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+