Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్రాణాలకు తెగించి పోటీల్లో పాల్గొనేందుకు సిద్ధమా..?

హైదరాబాద్: మరో రెండు రోజుల్లో 2018 వింటర్‌ ఒలింపిక్స్‌ సందడి మొదలు కాబోతోంది. ఈ పోటీలకు దక్షిణ కొరియాలోని పైయాంగ్‌చంగ్ వేదిక కానుంది. శుక్రవారంతో మొదలుకానున్న ఈ పోటీల్లో 102 స్వర్ణ పతకాల కోసం అథ్లెట్లు పోటీ పడనున్నారు. మంచులో క్రీడలంటే చూడటానికి సరదాగా ఉంటాయని అంతా అనుకుంటారు. కానీ ఆ సరదా మాటున ఎంతో సాహసం..అంతకుమించిన ప్రాణహాని ఉందని తెలిసింది అథ్లెట్లకు మాత్రమే.

Pyeongchang 2018: Athletes and events to watch

స్కై రేసర్లకు అంతే స్థాయిలో:

కెనడాలో జరిగిన రేసుల్లో రెండుసార్లు ఒలింపిక్‌ ఛాంపియన్‌ డేవిడ్‌ పియోసన్‌ (ఫ్రాన్స్‌), జర్మనీ టీనేజర్‌ మాక్స్‌ బుర్క్‌హర్ట్‌ ప్రాణాలు కోల్పోయారు. ఇక గాయాలపాలై కెరీర్‌ పోగొట్టుకున్న వాళ్లకైతే లెక్కే లేదు. ఒక ఫార్ములావన్‌ డ్రైవర్‌కు ఎంత ప్రమాదం పొంచి ఉంటుందో స్కై రేసర్లకు కూడా అంతే స్థాయి ప్రమాదం ఉంటుంది.

ప్రమాదాలు ప్రతి సారీ జరగవు:

‘‘ఈ క్రీడలు చాలా ప్రమాదకరం అని తెలుసు. అన్నింటికి సిద్ధపడే ఈ ఆటలు ఆడతాం. గాయాలు ఈ క్రీడల్లో భాగం. ప్రమాదాలు ప్రతిసారీ జరగవు.ఈ ఆటలు ప్రమాదకరం అనే విషయాన్ని మరిచి పోటీపడాలి. సాహసం చేయాలా లేదా అనేది మన ఇష్టం'' అని పియోసన్‌ సహచరుడు బ్లెయిజ్‌ అన్నాడు.

అస్వస్థతకు గురైన సిబ్బంది:

1200 మంది గార్డుల ఉపసంహరణ: నొరోవైరస్‌ కారణంగా శీతాకాల ఒలింపిక్స్‌ నుంచి 1200 మంది భద్రతా సిబ్బందిని ఉపసంహరించారు. ఈ సిబ్బందిలో 41 మందికి అకస్మాత్తుగా వాంతులు, వీరేచనాలు మొదలయ్యాయి.

 వేగంగా వైరస్ వ్యాప్తి:

వేగంగా వైరస్ వ్యాప్తి:

ఆస్పత్రికి తరలించగా.. వారికి నోరోవైరస్‌ ఇన్‌ఫెక్షన్‌ సోకినట్లు తేలింది. దీంతో సిబ్బందిని మొత్తం ఉపసంహరించి, వారి స్థానంలో 900 మంది సైనికులను నియమించారు. నొరోవైరస్‌ ఒకరి నుంచి ఒకరికి వేగంగా సంక్రమిస్తుంది.

ఇవే కారకాలు:

ఇవే కారకాలు:

కలుషిత ఆహారం, కలుషిత నీటి ద్వారా కూడా ఇది వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్‌ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకునేందుకు అధికారులు విచారణ జరుపుతున్నారు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Wednesday, February 7, 2018, 11:34 [IST]
Other articles published on Feb 7, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+