Paris Olympics: కోహ్లి ప్లాన్‌తో ఒలింపిక్స్‌లో సింధు.. ప్రత్యర్థికి చుక్కలే!
మరో మూడు రోజుల్లో ఒలింపిక్స్ ప్రారంభంకానున్నాయి. పతకాల వేట కోసం భారత్ నుంచి 16 క్రీడల్లో 117 మంది బరిలోకి దిగుతున్నారు. ప్రపంచ వేదికపై భారత్ ఖ్యాతిని మరింత చాటేలా మన ప్లేయర్లు పట్టుదలతో సిద్ధమయ్యారు. వరుసగా గత రెండు ఒలింపిక్స్‌లో పతకం సాధించిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఈసారి స్వర్ణం లక్ష్యంగా బరిలోకి దిగుతుతోంది.
రియో ఒలింపిక్స్‌లో సింధు రజతం, టోక్యోలో కంచు మోత మోగించిన విషయం తెలిసిందే. ఈ సారి మెరుగైన ప్రదర్శనతో స్వర్ణం సాధించి హ్యాట్రిక్ మెడల్స్ అందుకోవాలని బరిలోకి దిగుతోంది. ఈ ఘనత సాధిస్తే ఒలింపిక్స్‌లో మూడు పతకాలు సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా చరిత్రకెక్కుతోంది. అయితే సింధు ఇటీవల ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతోంది. కామన్వెల్త్ క్రీడల్లో గాయపడిన సింధు పునరాగమనం తర్వాత గత ఫామ్‌ను అందిపుచ్చుకోలేక పోయింది.

ఒలింపిక్స్‌కు అర్హత సాధించినప్పటికీ గత కొంత కాలంగా ఆడుతున్న ప్రముఖ ఈవెంట్లలో ఒక్క టైటిల్ కూడా నెగ్గలేదు. అయితే విశ్వక్రీడల్లో సింధును ఓడించడం ప్రత్యర్థికి అంత సులువు కాదు. ప్రధాన టోర్నీలో సరికొత్త ఉత్సాహంతో ఆడటం సింధుకు అలవాటే. టీ20 వరల్డ్ కప్ ఆద్యంతం తడబడిన కోహ్లి కీలక ఫైనల్‌లో గొప్పగా పోరాడి జట్టుకు విజయాన్ని అందించిన విషయం తెలిసిందే. అదే తరహాలో కొన్నాళ్లు పాటు తన సామర్థ్యానికి తగ్గట్లుగా ఆడని సింధు పారిస్‌లో విశ్వరూపాన్ని చూపిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. పారిస్ కోసమే తన అసలు ఫామ్‌ను దాచి ఉంచిందని భావిస్తున్నారు.
కాగా, సింధు గ్రూప్ దశను అధిగమించడం దాదాపు ఖాయమే. పదో సీడ్‌గా బరిలోకి దిగుతున్న సింధు గ్రూప్-ఎమ్‌లో రెండు మ్యాచ్‌లు ఆడనుంది. ప్రపంచ 75వ ర్యాంకర్ క్రిస్టిన్ కుబా (ఎస్తోనియా)తో, ప్రపంచ 111వ ర్యాంకర్ ఫాతిమత్ నభా (మాల్దీవులు)తో సింధు తలపడనుంది. ఈ ప్రత్యర్థులు కంటే బలమైన సింధు గ్రూప్ దశను ఈజీగా దాటుతుంది.
అయితే ప్రిక్వార్టర్స్‌లో చైనా ప్లేయర్, ఆరో సీడ్ హి జింగ్‌జియావోతో సింధు తలపడే అవకాశాలు ఉన్నాయి. హెడ్ టు హెడ్ రికార్డుల్లో సింధు 9-11తో కాస్త వెనుకంజలో ఉన్నా గెలిచే అవకాశాలు ఉన్నాయి. ప్రిక్వార్టర్స్‌లో సింధు గెలిస్తే.. క్వార్టర్స్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్, చైనా క్రీడాకారిణి చెన్ యు ఫైతో పోటీపడాల్సి ఉంటుంది. ముఖాముఖీ రికార్డుల్లో ఇద్దరూ 6-6తో సమంగా ఉన్నారు. చక్కని ప్రదర్శన చేస్తే సింధు సెమీఫైనల్‌కు చేరుకోవడం ఖాయమే.
కాగా, సెమీస్‌లో కఠిన ప్రత్యర్థి, రియో ఒలింపిక్స్ విజేత కరోలినా మారిన్ (స్పెయిన్)తో సింధు తలపడాల్సి ఉంటుంది. అయితే హెడ్ టూ హెడ్ రికార్డుల్లో కరోలినాకు మెరుగైన రికార్డు ఉంది. వీరిద్దరు ఇప్పటివరకు 17 సార్లు తలపడగా సింధు అయిదు సార్లు మాత్రమే గెలిచింది. కరోలినాపై సింధు గెలిస్తే పతకం ఖాయమవుతోంది. అప్పుడు సింధు చరిత్ర సృష్టిస్తుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications