Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఒలింపిక్స్‌ బహిష్కరణ: స్పష్టమైన ప్రకటన చేసిన పుతిన్

Putin: Russia will not boycott Pyeongchang Games

హైదరాబాద్: వచ్చే ఏడాది జరిగే వింటర్ ఒలింపిక్స్‌ బహిష్కరణపై మేము ఎలాంటి ప్రకటన చేయలేదని రష్యా అధ్యక్షుడు వ్లాదమిర్ పుతిన్ అన్నాడు. వచ్చేఏడాది పోంగ్యాచాంగ్ వేదికగా జరిగే వింటర్ ఒలింపిక్స్‌లో రష్యా అథెట్ల ప్రాతినిధ్యంపై సందిగ్ధత నెలకొన్న సంగతి తెలిసిందే.

డోపింగ్‌లో అథ్లెట్లు పట్టుబడిన కారణంగా రష్యాపై అంతర్జాతీయ ఒలింపిక్ సమాఖ్య(ఐవోసీ) నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే డోపింగ్‌లో పాలుపంచుకోని అథ్లెట్లు మాత్రం తటస్థ పతాకం కింద ఆడొచ్చని ఐవోసీ చీఫ్ థామస్ బాచ్ ప్రకటించిన నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఓ ప్రకటన చేశారు.

వింటర్ ఒలింపిక్స్‌లో రష్యా ఆడుతుందా? లేదా? అన్నదానిపై పుతిన్ బుధవారం ప్రకటన జారీ చేశారు. 'బహిష్కరణపై మేము ఎలాంటి ప్రకటన చేయలేదు. మా దేశ అథ్లెట్లను ఒలింపిక్స్‌లో పాల్గొనకుండా అడ్డుకోవాలనుకోవడం లేదు. వ్యక్తిగతంగా పోటీపడేందుకు సిద్ధమైనా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు' అని పుతిన్ అన్నారు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Thursday, December 7, 2017, 12:06 [IST]
Other articles published on Dec 7, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+