
హైదరాబాద్: ప్రొ రెజ్లింగ్ లీగ్ సీజన్-3లో పంజాబ్ రాయల్స్ జట్టు ఫైనల్ చేరింది. సెమీస్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఎన్‌సీఆర్ పంజాబ్ రాయల్స్ 6-3 తేడాతో వీర్ మరాఠాస్‌పై విజయం సాధించింది. బుధవారం జరిగిన సెమీస్‌లో పంజాబ్ 50-39తో ముగించింది.
సెమీస్‌లో పంజాబ్ మ్యాచ్‌లో వరుసగా మొదటి నాలుగు బౌట్లు గెలిచి పంజాబ్ సత్తా చూపించింది. 65 కేజీల్లో ఇలియాస్ (పంజాబ్) 10-4తో అమిత్‌పై, 76 కేజీల్లో లారోక్ (పంజాబ్) 4-3తో వాసిలాస్‌పై, 125 కేజీల్లో పెట్రిష్‌వాలి (పంజాబ్) 4-0తో లెవాన్‌పై, అనాస్థాసిజా (పంజాబ్) 16-0తో రితు మాలిక్‌పై గెలిచారు.
92 కేజీల్లో కెటోవ్ (వీర్) 9-2తో దీపక్ పూనియాను ఓడించి ఆధిక్యాన్ని 3-1కి తగ్గించింది. 57 కేజీల్లో పూజ దండా (పంజాబ్) 6-4తో మర్వా అమ్రిపై నెగ్గగా, ఉత్కర్ష్ కాలే (పంజాబ్) 0-9తో శ్రవణ్ చేతిలో ఓడాడు. 50 కేజీల్లో రితూ పోగట్ (వీర్) 6-2తో నిర్మలా దేవిపై గెలిచారు.
యూపీ దంగల్, హర్యానా హామర్స్ మధ్య జరిగే మరో సారి పోటీ జరగనుంది. ఈ పోటీలో విజేతతో సెమీస్‌లో పంజాబ్ ఫైనల్లో తలపడాల్సి ఉంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.