For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మెరిసిన సౌరవ్ గంగూలీ, డెక్కన్ చార్జర్స్‌పై పూణే వారియర్స్ విజయం

By Pratap
Sourav Ganguly
హైదరాబాద్: చాలా రోజుల తర్వాత అడుగు పెట్టిన సౌరవ్ గంగూలీ మెరిశాడు. పాండే, గంగూలీ రాణించి పూణే వారియర్స్‌కు డెక్కన్ చార్జర్స్‌పై విజయం సాధించి పెట్టారు. మంగళవారం ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో డెక్కన్‌ ఛార్జర్స్‌ 6 వికెట్ల తేడాతో పుణె వారియర్స్‌తో చేతిలో పరాజయం చవిచూసింది. మ్యాచ్‌లో ఛార్జర్స్‌ 6 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఛార్జర్స్‌ నిర్దేశించిన 137 పరుగుల లక్ష్యాన్ని పుణె 18.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. ఛార్జర్స్‌ పతనాన్ని శాసించిన మిషెల్‌ మార్ష్‌ (4/25) 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌'గా ఎంపికయ్యాడు.

మ్యాచ్‌లో ప్రధాన ఆకర్షణ సౌరభ్‌ గంగూలీనే. ఈ సీజన్లో తొలిసారి బరిలో దిగిన దాదా (32 నాటౌట్‌; 32 బంతుల్లో 3X4, 1X6) పుణె, అభిమానుల ఆశల్ని వమ్ము చేయలేదు. జట్టును గెలిపించే ఇన్నింగ్స్‌ ఆడాడు. మిశ్రా బౌలింగ్‌లో డీప్‌ స్క్వేర్‌ లెగ్‌ మీదుగా కొట్టిన సిక్సర్‌ పాత దాదాను గుర్తుచేసింది. ఓపెనర్లు ఆరంభంలోనే రైడర్‌ (35; 20 బంతుల్లో 5X4, 2X6), మనీష్‌ పాండే (49; 42 బంతుల్లో 6X4, 2X6) తొలి వికెట్‌కు 55 పరుగులు జోడించి, శుభారంభాన్నివ్వడంతో తర్వాత వచ్చిన దాదా స్వేచ్ఛగా బ్యాటింగ్‌ చేశాడు. పాండే, ఉతప్ప (1)లు స్వల్ప వ్యవధిలో వెనుదిరిగినా యువరాజ్‌ (2) కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవకున్నా గంగూలీ చివరిదాకా ఉండి, జట్టును గెలిపించాడు.

ఐపీఎల్‌లో మొదటి నుంచి బ్యాటింగ్‌లో తడబడుతున్న డెక్కన్‌ ఛార్జర్స్‌ ఈ మ్యాచ్‌లోనూ అదే లక్షణాన్ని ప్రదర్శించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఛార్జర్స్‌కు శుభారంభమే లభించింది. ఓపెనర్లు శిఖర్‌ ధావన్‌ (24; 17 బంతుల్లో 1X4, 2X6), రవితేజ (30; 27 బంతుల్లో 4X4) మంచి పునాది వేశారు. ఐతే వీరిద్దరూ వరుస ఓవర్లలో వెనుదిరిగడంతో ఛార్జర్స్‌ మళ్లీ పాత పాటే అందుకుంది. మిచెల్‌ మార్ష్‌, యువరాజ్‌ (2/17), రాహుల్‌శర్మ (1/24) కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేస్తూ క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టారు. డుమిని (30; 30 బంతుల్లో 1X4) పోరాడినా.. అతనికి మద్దతిచ్చేవారే కరవయ్యారు.
Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+