Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆఖరి రేసుకి ముందే ఉసేన్ బోల్ట్‌కు ఉద్యోగం దొరికింది

హైదరాబాద్: జమైకా పరుగుల చిరుత ఉసేన్ బోల్ట్ లండన్ వేదికగా తన ఆఖరి పరుగుకి సిద్ధమయ్యాడు. శుక్రవారం రాత్రి నుంచి లండన్‌లో వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ వరల్డ్ చాంపియన్‌షిప్‌తో రిటైర్మెంట్ తీసుకోనున్నట్లు బోల్ట్ ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే.

దీంతో అందరి కళ్లు బోల్ట్ పైనే ఉన్నాయి. ఇప్పటికే 8 ఒలింపిక్ స్వర్ణాలు, 11 ప్రపంచ బంగారు పతకాలతో మరే అథ్లెట్‌కు అందనంత ఎత్తులో నిలిచిన ఈ పరుగుల చిరుత ఆఖరి రేసులో కూడా అంతే ఘనంగా ముగించి గ్రాండ్‌గా వీడ్కోలు తీసుకోవాలన్న పట్టుదలతో ఉన్నాడు.

ఈ చాంపియన్‌షిప్‌లో ఉసేన్ బోల్ట్ కేవలం రెండు ఈవెంట్లలో మాత్రమే పరుగెత్తనున్నాడు. 100 మీటర్లు, 4*100 మీటర్ల రిలేలో బోల్ట్ పాల్గొంటున్నాడు. రిటైర్మెంట్ అనంతరం ఉసేన్ బోల్ట్ ఇన్నాళ్లు తాను బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న పూమా కంపెనీలోనే ఉద్యోగిగా మారనున్నాడు.

ఉసేన్ బోల్ట్ మాకెంతో విలువైన ఆటగాడు

ఉసేన్ బోల్ట్ మాకెంతో విలువైన ఆటగాడు

ఈ మేరకు పూమా కంపెనీ ప్రతినిధులు అధికారిక ప్రకటన చేశారు. ఉసేన్ బోల్ట్ పరుగుకి స్వస్తి పలికినప్పటికీ మాకెంతో విలువైన ఆటగాడని పూమా కంపెనీ ఛీప్ ఎగ్జిక్యూటివ్ బిజోన్ గుల్డన్ పేర్కొన్నాడు. బోల్ట్‌ 15 సంవత్సరాల వయసు నుంచి ప్యూమా ప్రచార కార్యకర్తగా ఉన్నాడని అన్నారు.

బోల్ట్ ద్వారా మా ప్రొడక్ట్‌ వృద్ధి పెరుగుతుంది

బోల్ట్ ద్వారా మా ప్రొడక్ట్‌ వృద్ధి పెరుగుతుంది

'అతను పరుగుకి స్వస్తి పలికినప్పటికీ మాకెంతో విలువైన ఆటగాడు. అతని ద్వారా మా ప్రొడక్ట్‌ వృద్ధి పెరుగుతూనే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అతనికి కరేబియన్‌లో తమ సంస్థ వ్యాపార వ్యవహారాలను ఇకపై అతనే చూసుకుంటాడు. ఈ కొత్త బాధ్యతలను అతను సమర్థవంతంగా నిర్వహిస్తాడని భావిస్తున్నాం' అని తెలిపారు.

రిటైర్మెంట్ తర్వాత కూడా మా ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడరే

రిటైర్మెంట్ తర్వాత కూడా మా ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడరే

పూమాకి ప్రత్యర్ధి కంపెనీలుగా ఉన్న నైక్ బాస్కెట్ బాల్ మాజీ ప్లేయర్ మైకెల్ జోర్డాన్‌తో మల్టీ మిలియన్ డాలర్ బ్రాండ్‌ని ఏర్పాటు చేసుకుందని, అదే విధంగా అదిదాస్ కంపెనీ ఇంగ్లాండ్ మాజీ సాకర్ పుట్‌బాల్ దిగ్గజం డేవిడ్ బెకహాంని తన ఉత్పత్తులకు ప్రచారకర్తలుగా నియమించుకున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిపే బోల్ట్‌కు ఆఖరి రేసు

ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిపే బోల్ట్‌కు ఆఖరి రేసు

ఆగస్టు చివరి నాటికి 31వ పుట్టినరోజుని జరుపుకోనున్న ఉసేన్ బోల్ట్ విన్యాసాలను చూసేందుకు ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. శుక్రవారం 100 మీటర్ల హీట్స్‌లో పోటీపడే బోల్ట్‌.. శనివారం ఫైనల్స్‌లో అభిమానులను అలరించనున్నాడు. ఆ తర్వాత 4×100 రిలే పరుగులో పోటీ పడనున్నాడు.

ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో బోల్ట్ రేసుల షెడ్యూల్:

ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో బోల్ట్ రేసుల షెడ్యూల్:

100 మీటర్ల సెమీస్, ఫైనల్ ఆగస్టు 5 (అర్ధరాత్రి 12 నుంచి)

4X100 మీటర్ల రిలే క్వాలిఫికేషన్ ఆగస్టు 12 (సాయంత్రం 3.25కు)

4X100 మీటర్ల రిలే ఫైనల్ ఆగస్టు 12 (అర్ధరాత్రి 2.20కు)

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+