న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రపంచ విజేతా.. !! 'నిన్ను చూస్తే గర్వంగా ఉంది'

Dipa Karmakar wins gold at the Gymnastics World Cup
 Proud Of You: Amitabh Bachchan Showers Praises On Gymnast Dipa Karmakar

హైదరాబాద్: రియో ఒలింపిక్స్ లో పతకం వచ్చేస్తుంది అనుకున్న తరుణంలో చేజారింది. తృటిలో తప్పిన ఈ అవకాశం కోసం వేచి చూసింది దీప కర్మాకర్.. ఇటీవల జరిగిన ప్రపంచ స్థాయి టోర్నీలో ప్రొడునోవా విన్యాసంతో రియో ఒలింపిక్స్‌లో అద్భుత ప్రదర్శన చేసి పతకాన్ని సాధించింది. దీంతో స్వర్ణం ఆమె వశమైంది. ఎఫ్‌ఐజీ ఆర్టిస్టిక్‌ జిమ్నాస్టిక్‌ ప్రపంచ ఛాలెంజ్‌ కప్‌లో స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. ఈ టోర్నీలో పసిడి నెగ్గిన భారత తొలి జిమ్నాస్ట్‌ దీపనే కావడం విశేషం.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు ఆమెను అభినందించారు. 'నిన్ను చూసి గర్వపడుతున్నాం' అని కొనియాడారు.

ధైర్యానికి ఈ విజయం నిదర్శనం

‘అభినందనలు దీప కర్మాకర్‌. భారత్‌ గర్వపడుతోంది. ఆమె దృఢత్వానికి, పట్టువిడవని ధైర్యానికి ఈ విజయం నిదర్శనం'

దేనికైతే తిరస్కరించారో దాన్ని సాధించావు:

‘ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పసిడి సాధించిన దీప కర్మాకర్‌కు అభినందనలు. ఒలింపిక్స్‌లో దేనికైతే నిన్ను తిరస్కరించారో దాన్ని ఇక్కడ సాధించావు. నువ్వేంటో నిరూపించావు. నిన్ను చూస్తే గర్వంగా ఉంది. నీ వల్ల దేశం గర్వపడుతోంది'.

ముద్దుబిడ్డ గర్వపడేలా చేసి:

‘త్రిపుర ముద్దుబిడ్డ దీప కర్మాకర్‌ దేశం మరోసారి గర్వపడేలా చేసింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించిన దీపకు శుభాకాంక్షలు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందికి నీవు స్ఫూర్తిదాయకం'

కంగ్రాట్స్‌ ఛాంపియన్‌ దీప

‘రియో ఒలింపిక్స్‌ తర్వాత మోకాలి గాయం నుంచి ప్రపంచ ఛాలెంజ్‌ కప్‌లో అద్భుత ప్రదర్శన వరకు చేరుకున్నావు. ప్రపంచ ఛాలెంజ్‌ కప్‌లో పసిడి సాధించావు. కంగ్రాట్స్‌ ఛాంపియన్‌ దీప కర్మాకర్‌. చాలా గర్వంగా ఉంది'.

పునరాగమనంలో చారిత్రక పతకం

‘మోకాలి గాయంతో రెండేళ్లు బాధపడి ఆటకు దూరంగా ఉన్నా.. పునరాగమనంలో చారిత్రక పతకం సాధించింది. దేశం గర్వపడేలా చేసిన దీప కర్మాకర్‌కు చాలా చాలా అభినందనలు'.

Story first published: Monday, July 9, 2018, 16:37 [IST]
Other articles published on Jul 9, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X