
హైదరాబాద్: వాసిలిసా మార్జాల్యూక్ వీర్ మరాఠాస్ జట్టును సెమీ ఫైనల్‌కు అడుగుదూరంలో నిలబెట్టింది. ఆదివారం రాత్రి జరిగిన ఆఖరి బౌట్‌లో 4-2 పాయింట్ల తేడాతో ఢిల్లీ సుల్తాన్స్‌పై పైచేయి సాధించింది. సిరి ఫోర్ట్ ఇండోర్ స్టేడియం వేదికగా సాగిన ఈ మ్యాచ్‌లో గెలవడంతో ఈ ఛాంపియన్
ట్రోఫీలో సెమీ ఫైనల్‌కు వీర్ మరాఠాస్ జట్టు చేరింది.
ఆరో, చివరి బౌట్‌లో 2017 వరల్డ్ చాంపియన్‌షి్‌ప రజత పతక విజేత వాసిలిసా మర్జాల్యూక్ (బెలారస్) 6-0తో సమర్ హమ్జా (ఈజిప్ట్)ను చిత్తు చేసి మరాఠాస్ కు కీలక విజయం అందించింది. మరొక వైపు కామన్ వెల్త్ ఛాంపియన్ షిప్ వెండి పతక విజేత అయిన రాణా 74 కేజీల విభాగంలో మరాఠాస్ జట్టుకు వినోద్ ఓం ప్రకాశ్‌ను ఓడించి మరో గెలుపును సొంతం చేసుకున్నాడు.
అంతకుముందు జరిగిన బౌట్లలో టైటాన్స్ జట్టుతో తలపడిప మరాఠాస్ జార్జి కెటోవ్ అనే ప్రత్యర్థిని చిత్తు చేసింది. ఈ బౌట్‌లో 3-1తేడాతో విజయం సాధించింది. సుల్తాన్స్ జట్టు ఓటమికి దగ్గరౌతుందన్న సమయంలో పోరాటాన్ని తీవ్రం చేసింది. అయిన అలవోకగా ఆల్బోరవ్ విజయాన్ని పొందాడు.
ఆల్బోరవ్ మొదటి రౌండ్‌లో డ్రాగా ముగించాడు. తర్వాతి రౌండ్‌లో 3-0తేడాతో లీడ్‌ను సొంతం చేసుకున్నాడు. కెటోవ్ పోరాడేందుకు ఎంత ప్రయత్నించినా ఆల్బోరవ్ ధాటికి నిలవలేకపోయాడు. కనీసం పాయింట్ ఇవ్వకుండా ఉండేందుకు ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.