Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్రో వాలీబాల్ లీగ్: ప్లే ఆఫ్స్‌కు చెన్నై స్పార్టన్స్‌

Pro Volleyball League: Chennai Spartans qualify for playoffs after defeating Ahmedabad Defenders

హైదరాబాద్: ప్రొ వాలీబాల్‌ లీగ్‌లో చెన్నై స్పార్టన్స్‌ జట్టు ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై స్పార్టన్స్‌ 15-6, 13-15, 15-13, 15-11, 15-12తో అహ్మదాబాద్‌ డిఫెండర్స్‌పై గెలుపొంది ప్లే ఆఫ్స్‌ బెర్తు దక్కించుకుంది.

చెన్నై తరఫున రూడీ వెర్చాఫ్‌ 18 స్పైక్స్, 2 సర్వ్‌ పాయింట్లతో మొత్తం 20 పాయింట్లు స్కోర్‌ చేసి అంతకముందు అతడి పేరిటే ఉన్న రికార్డును మరోసారి అధిగమించాడు. ఒకే మ్యాచ్‌లో 20 పాయింట్లు సాధించడం వెర్చాప్‌కిది మూడోసారి. ఇప్పటివరకు వెర్చాఫ్‌ 80 పాయింట్లు సాధించి లీగ్‌లో అగ్రస్థానంలో నిలిచాడు.

దీంతో టోర్నీలో అత్యధిక స్కోరర్‌‌గా కొనసాగుతున్నాడు. కాగా, టోర్నీలో ఇప్పటికే కాలికట్‌ హీరోస్, కొచ్చి బ్లూ స్పైకర్స్‌ సెమీస్‌లో అడుగుపెట్టాయి. సోమవారం యు ముంబా వాలీ, అహ్మదాబాద్‌ స్పైకర్స్‌ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌తో చివరిదైన నాలుగో ప్లేఆఫ్‌ బెర్తు ఖరారు కానుంది.

Story first published: Monday, February 18, 2019, 8:12 [IST]
Other articles published on Feb 18, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+