Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పట్నా పైరేట్స్‌కు షాకిచ్చిన తమిళ్ తలైవాస్

Pro Kabaddi League: Tamil Thalaivas crush Patna Pirates 42-26

అట్టహాసంగా ప్రారంభమైన ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో డిఫెండింగ్ చాంపియన్ పట్నా పైరేట్స్ శుభారంభం చేయలేకపోయింది. ఆదివారం జరిగిన జోన్-బి తొలి మ్యాచ్‌లోతమిళ్ తలైవాస్ 42-26తో పట్నాను ఓడించింది. ఫలితంగా 5 పాయింట్లు ఖాతాలో వేసుకుంది. ఇలా మూడుసార్లు విజేత పట్నా పైరేట్స్‌కు తొలి మ్యాచ్‌లోనే షాక్‌ తగిలింది.

ఆరంభం నుంచి తలైవాస్‌దే దూకుడు

ఆరంభం నుంచి తలైవాస్‌దే దూకుడు

కళ్లుచెదిరేలా ఆడిన తమిళ్‌ తలైవాస్‌ 42-26తో పట్నా పైరేట్స్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో ఆరంభం నుంచి తలైవాస్‌దే దూకుడు. జస్వీర్‌సింగ్‌, అజయ్‌ ఠాకూర్‌ విజృంభించడంతో తలైవాస్‌ 4-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ప్రదీప్‌ నర్వాల్‌ మధ్య మధ్యలో మెరిసినా తలైవాస్‌ మాత్రం జోరు తగ్గించలేదు. అర్ధభాగం ముగిసే సమయానికి ఆ జట్టు 26-8తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది.

మరో 5 నిమిషాల్లో ముగుస్తుందనగా

మరో 5 నిమిషాల్లో ముగుస్తుందనగా

రెండో అర్ధభాగంలో పైరేట్స్‌ కాస్త పుంజుకుంది. కానీ తలైవాస్‌ అదే దూకుడు కొనసాగించింది. మరో ఐదు నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా ప్రదీప్‌ నర్వాల్‌ను సూపర్‌ ట్యాకిల్‌ చేసిన తలైవాస్‌ మూడు పాయింట్లు ఖాతాలో వేసుకుంది. దీంతో 42-26తో పైరేట్స్‌కు ఓటమి తప్పలేదు.

గనంగా జరిగిన ఆరంభోత్సవం

గనంగా జరిగిన ఆరంభోత్సవం

తలైవాస్‌ తరఫున అజయ్‌ ఠాకూర్‌ 14 రైడ్‌ పాయింట్లు సాధించగా.. అమిత్‌ హుడా నాలుగు ట్యాకిల్‌ పాయింట్లు తీసుకొచ్చాడు. పట్నా తరఫున ప్రదీప్‌ నర్వాల్‌ 11 రైడ్‌ పాయింట్లు సాధించగా.. వికాస్‌ కాలె ఒక ట్యాకిల్‌ పాయింట్‌ తెచ్చాడు. ఈ మ్యాచ్‌కు ముందు ఆరంభోత్సవం గనంగా జరిగింది.

 శ్రుతి హాసన్‌ జాతీయ గీతాన్ని ఆలపించగా

శ్రుతి హాసన్‌ జాతీయ గీతాన్ని ఆలపించగా

నటి శ్రుతి హాసన్‌ జాతీయ గీతాన్ని ఆలపించగా, నటుడు విజయ్‌ సేతుపతి తదితరులు ఆరంభోత్సవంలో పాల్గొని ఆటగాళ్లను ఉత్సాహపరిచారు. సోమవారం జరుగనున్న లీగ్‌ మ్యాచ్‌ల్లో హరియాణా స్టీలర్స్‌తో పుణేరీ పల్టన్, యూపీ యోధాతో తమిళ్‌ తలైవాస్‌ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లు రాత్రి 8 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌-2లో ప్రత్యక్ష ప్రసారం అవుతాయి.

Story first published: Monday, October 8, 2018, 11:58 [IST]
Other articles published on Oct 8, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+