Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పరుగుల రాణి పీటీ ఉషగా ప్రియాంక చోప్రా?

హైదరాబాద్: ప్రస్తుతం భారతీయ సినీపరిశ్రమలో బయోపిక్‌ల హవా నడుస్తోంది. మిల్కా సింగ్‌ దగ్గర నుంచి నిన్నటి సచిన్ టెండూల్కర్ వరకు చాలామంది ప్రముఖ క్రీడాకారుల జీవితాలను బయోపిక్‌ల రూపంలో వెండితెరపై ఆవిష్కరించారు. ప్రస్తుతం భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్‌ల బయోపిక్‌లను తెరకెక్కించే సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.

తాజాగా మరో బయోపిక్‌ తెరమీదికి వచ్చింది. అథ్లెటిక్స్, ఒలంపిక్స్ ఆధారంగా దిగ్గజ స్ప్రింటర్ పీటీ ఉషపై మరో బయోపిక్ సెట్స్‌పైకి వెళ్లనుంది. పరుగుల రాణి పీటీ ఉష జీవిత కథ ఆధారంగా దక్షిణాదికి చెందిన ప్రముఖ దర్శకురాలు రేవతి వర్మ ఓ బయోపిక్ సినిమాను తెరకెక్కించేందుకు సిద్ధమవుతోంది.

 పీటీ ఉషగా ప్రియాంక చోప్రా?

పీటీ ఉషగా ప్రియాంక చోప్రా?

జూన్ ఆర్(తమిళం), మ్యాడ్ డాడ్ (మళయాళం) చిత్రాలతో మంచి దర్శకురాలిగా గుర్తింపు తెచ్చుకున్న రేవతి వర్మ ఈ సినిమాకు డైరెక్షన్ చేయనున్నారు. ఇంతకుముందు ‘మేరీకోమ్‌' సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన బాలీవుడ్ స్టార్‌ హీరోయిన్‌ ప్రియాంక చోప్రాను ఉషగా చూపించాలని చిత్ర బృందం భావిస్తోందట.

 రెహమాన్‌ సంగీతం

రెహమాన్‌ సంగీతం

ప్రస్తుతం ఆమెతో చర్చలు జరుగుతున్నాయి. దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్‌తో నిర్మించే ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత రెహమాన్‌ సంగీతం సమకూర్చే అవకాశాలున్నాయి. కేవలం హిందీలోనే కాకుండా తెలుగు, తమిళం సహా మరికొన్ని భాషల్లోనూ ఈ చిత్రాన్ని తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఉషను ఒప్పించడానికి కష్టపడాల్సి వచ్చింది

ఉషను ఒప్పించడానికి కష్టపడాల్సి వచ్చింది

ఈ సినిమా కోసం పీటీ ఉషను ఒప్పించడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందని రేవతి అన్నారు. ఈ బయోపిక్ కోసం ఆమెని ఎన్నిసార్లు కలిసినా.. ఆమె నుంచి మాత్రం ఇది సరైన సమయం కాదనే సమాధానం వచ్చిందని అన్నారు. అంతేకాదు భారత్ నుంచి అథ్లెటిక్స్‌లో ఎవరో ఒకరు గోల్డ్ మెడల్ సాధించిన తర్వాతే బయోపిక్ గురించి ఆలోచిద్దామని పీటీ ఉష చెప్పేవారని అన్నారు.

 ఒలింపిక్‌ పతకాన్ని త్రుటిలో చేజార్చుకొన్న పీటీ ఉష

ఒలింపిక్‌ పతకాన్ని త్రుటిలో చేజార్చుకొన్న పీటీ ఉష

చివరకు ఎలాగోలా అతి కష్టమ్మీద ఆమెని ఒప్పించగలిగానని రేవతి చెప్పుకొచ్చారు. ఒకప్పుడు పరుగుల రాణిగా పేరుపొంది ఒలింపిక్‌ పతకాన్ని త్రుటిలో చేజార్చుకొన్న పీటీ ఉష జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఉండే అవకాశం ఎక్కువేనని అంటున్నారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+