Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అభిమాని మోకాళ్లపై కూర్చొని లవ్ ప్రపోజ్, నో చెప్పిన అందాల బొమ్మ

ప్యారిస్: టెన్నిస్ స్టార్ కరోలిన్ వోజ్నియాకి ఓ వ్యక్తి మోకాళ్ల పైన కూర్చొని ప్రేమిస్తున్నట్లు చెప్పాడట. అయినా కూడా ఆమె కనికరించలేదట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పింది. డెన్మార్క్‌ టెన్నిస్‌ బ్యూటీ అయిన వోజ్నియాకికి ఓ వ్యక్తి మోకాళ్లపై కూర్చొని చాలా రొమాంటిక్‌గా లవ్‌ ప్రపోజ్‌ చేశాడు.

తన ప్రేమను ఇంత బాగా వ్యక్తం చేసిన ఆ వ్యక్తి ఆమె మాజీ బాయ్‌ఫ్రెండ్‌ మెకెల్‌రాయా లేక ప్రస్తుత లవర్‌ జేజే వాట్‌లలో ఎవరు కాదు. ఆమెకు ప్రేమను అలా ఎక్స్‌ప్రెస్‌ చేసింది ఆమె వీరాభిమాని.

అభిమాని అంతగా లవ్ ప్రపోజ్ చేసినా ఆమె అంగీకరించలేదు. అంతటి అభిమానాన్ని గుండెల్లో దాచుకుంటాను తప్పితే తన గుండెల్లో చోటు మాత్రం ఇవ్వలేనని అతనికి ఆమె చెప్పేసిందట.

Caroline Wozniacki

అమెరికాకు చెందిన ఓ అభిమాని తన ముందు మోకాళ్లపై కూర్చున్నాడని, తనను పెళ్లి చేసుకోమని రింగ్‌ ఇవ్వచూపాడని కానీ, దానికి అతను మా నాన్నను పర్మిషన్‌ అడగలేదని ఆమె చెప్పింది. అందుకే అతని ప్రపోజల్‌ను తిరస్కరించాల్సి వచ్చిందని వోజ్నియాకి చెప్పింది.

ఈ సంఘటన అమెరికాలో జరిగిందని చెప్పింది. దురదృష్టవశాత్తు అతని కోరికను తాను మన్నించలేకపోయానని చెప్పింది.

ఇంతవరకు ఒక్క గ్రాండ్‌స్లామ్‌ కూడా నెగ్గలేకపోయిన వోజ్నియాకి ఫ్రెంచ్‌ ఓపెన్‌లోనూ రెండో రౌండ్లోనే నిష్క్రమించింది. ఫ్రెంచ్‌ ఓపెన్‌లో వోజ్నియాకిని సపోర్ట్‌ చేసేందుకు ఆమె బాయ్‌ఫ్రెండ్‌ వాట్‌ కూడా పారిస్‌కు వచ్చాడని సమాచారం.

Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+