ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటి, ఐపీఎల్ జట్టు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సహ యజమాని ప్రీతిజింతా వేధింపుల కేసు విషయమై తన మాజీ ప్రియుడు నెస్ వాడియాతో కాంప్రమైజ్ అయ్యేందుకు సిద్ధంగా లేరట. ప్రీతిజింతా, నెస్ వాడియా వేధింపుల కేసు నేపథ్యంలో వారిద్దరి మధ్య రాజీ కుదిర్చేందుకు ముగ్గురు ప్రయత్నించారట.

అయితే, ప్రీతిజింతా మాత్రం అందుకు సిద్ధంగా లేరట. వారి మధ్య రాజీ కుదిర్చేందుకు.. ఇద్దరికీ బాగా తెలిసిన ప్రముఖులు ప్రయత్నాలు చేశారట. కానీ కుదరలేదట.
మరోవైపు, ప్రీతిజంతాను నెస్ వాడియా వేధించినట్లు మరో సాక్షి చెప్పినట్లుగా తెలుస్తోంది. మ్యాచ్ జరిగిన తర్వాత రోజు తాను ప్రీతి ఇంటికి వెళ్లినప్పుడు.. ఆమె తన మోచేయికి ఉన్న గాయాలను చూపించిందని చెప్పినట్లుగా తెలుస్తోంది. నెస్ వాడియా ప్రీతిజింతాను లాగడం తాను చూశానని, అయితే స్టేడియం అయినందున వారిద్దరు ఏం వాదించుకుంటున్నారో తాను వినలేదని చెప్పారని సమాచారం.