హైదరాబాద్: తెలుగు క్రీడాకారిణి బొడ్డా ప్రత్యూష ఉమెన్ ఇంటర్నెషనల్ మాస్టర్ (డబ్ల్యూఐ ఎమ్) చెస్ టైటిల్ గెలుచుకుంది.
2128 ఫిడే (అంతర్జాతీయ చెస్ సమాఖ్య) రేటింగ్ పాయింట్లతో ఉన్న 18 ఏళ్ల ప్రత్యూష ఈ ఘనత సాధించింది.
తెలుగు రాష్ట్రాల నుంచి డబ్లూఐఎమ్ నెగ్గిన నాలుగో అమ్మాయి ప్రత్యూష. ఆమె కంటే ముందు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, లక్ష్మీసాహితి ఈ టైటిల్ గెలుచుకున్నారు.

ఈ సందర్భంగా ప్రత్యూషను ఆమె కోచ్ ఎన్. రామరాజు, గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారిక సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో మంగళవారం సన్మానించారు.
చాలా రోజుల కృషి, పట్టుదలతో పాటు కోచ్ శిక్షణతోనే ప్రత్యూష ఈ స్థాయికి చేరుకుందని హారిక చెప్పింది.
ప్రత్యూష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లా నర్సీపట్నానికి చెందిన ప్రత్యూష ఇంటర్మీడియట్ చదువుతోంది.
ప్రత్యూష ఈ స్థాయికి చేరుకోవడం ఆమె కృషి, పట్టుదల, కోచ్ రామరాజు శిక్షణ కారణమని హారిక ద్రోణవల్ిల అన్నారు.
ప్రత్యూష గత ఏడేళ్లుగా చాలా బాగా రాణిస్తోందని, ఉమెన్ గ్రాండ్ మాస్టర్ టైటిల్‌ను రెండేళ్లలో సాధించాలనే లక్ష్యంతో ఉందని కోచ్ రామరాజు చెప్పారు.