1009 పరుగుల ప్రణవ్‌కు ఎమ్‌సీఏ స్కాలర్‌షిప్
ముంబై: ఒకే ఇన్నింగ్స్‌లో 1009 పరుగులు సాధించి ప్రపంచ రికార్డు నెలకొల్పిన ముంబై స్కూలు బాలుడు ప్రణవ్ ధనవాడేకు ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎమ్‌సీఏ) స్కాలర్‌షిప్‌ను ప్రకటించింది. ముంబై క్రికెట్ అసోసియేషన్ తరుపున నెలకు రూ. 10,000ల చొప్పున ఐదేళ్ల పాటు ప్రణవ్ ధనవాడేకు స్కాలర్‌షిప్ ఇచ్చేందుకు అధ్యక్షుడు శరద్ పవార్ అంగీకరించినట్లు ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ స్కాలర్‌షిప్‌ను ఈ ఏడాది జనవరి 2016 నుంచి డిసెంబర్ 2021 వరకు ఇస్తున్నట్లు ఎమ్‌సీఏ పేర్కొంది. ఈ ఐదేళ్ల కాలంలో ప్రణవ్ ధనవాడేకు సంబంధించిన క్రికెట్, చదువుకు సంబంధించి అంశాలను ఎమ్‌సీఏ పర్యవేక్షిస్తుందని అందులో పేర్కొన్నారు.

కాగా, 15 ఏళ్ల ప్రణవ్ ధనవాడే... ముంబై క్రికెట్ అసోసియేషన్ నిర్వహించిన ఇంటర్ స్కూల్ లెవల్ టోర్నమెంట్‌లో ఆర్యా గురుకుల్ పాఠశాల జట్టుపై ఒకే ఇన్నింగ్స్‌లో 1009 పరుగులు సాధించి ప్రపంచ రికార్డు సృష్టించాడు. 323 బంతుల్లోనే 1000 పరుగులు సాధించాడు.
అందులో 59 సిక్స్‌లు, 129 ఫోర్లు ఉన్నాయి. 3 వికెట్లు కోల్పోయి 1465 పరుగుల వద్ద కేసీ గాంధీ పబ్లిక్ మ్యాచ్‌ను డిక్లేర్ చేసింది. ఇది కూడా ఓ ప్రపంచ రికార్డు. 1899వ సంవత్సరంలో ఆర్థన్ కోలింగ్ చేసిన 628 పరుగులే ఇప్పటివరకు ఏ విభాగంలోనైనా అత్యధిక స్కోరుగా రికార్డులో ఉంది.
తద్వారా క్రికెట్‌లో 116 ఏళ్ల నాటి ప్రపంచ రికార్డును తిరగరాశాడు. కాగా ప్రణవ్ తండ్రి ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్న సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications