శిఖరం చేరాలంటే అడ్డంకులు తప్పవు.:ప్రజ్ఞానంద తండ్రి
భారత యువ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించాడు. చెస్ వరల్డ్ కప్ ఫైనల్ చేరిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. ఈ మెగా టోర్నీ సెమీ ఫైనల్‌లో అమెరికన్ గ్రాండ్ మాస్టర్, ప్రపంచ నెంబర్ 3 ఫాబియానో కరౌనాను ఓడించాడు. టైబ్రేకర్‌లో అద్భుతంగా ఆడిన ప్రజ్ఞానంద.. ఫైనల్‌లో వరల్డ్ నెంబర్ వన్ కార్లసన్‌తో ఢీకొట్టనున్నాడు.
ప్రజ్ఞానంద విజయం చూసిన భారత దేశం అంతా ఆనందంలో మునిగిపోయింది. రాజకీయ నాయకుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ అతనికి శుభాకాంక్షలు చెప్పారు. అయితే అందరి కన్నా ఎక్కువగా ప్రజ్ఞానంద తల్లిదండ్రులు సంతోషిస్తున్నారని అనడం అతిశయోక్తి కాదు.

దశాబ్దం క్రితం భారత లెజెండ్ విశ్వనాథ్ ఆనంద్ ఈ మెగా టోర్నీ ఫైనల్ చేరాడు. ఆ తర్వాత మరో ప్లేయర్ ఈ అర్హత సాధించలేదు. మళ్లీ ఇప్పుడు ప్రజ్ఞానంద ఆ ఘనత సాధించాడు. ఈ ఫైనల్ చేరే క్రమంలో ప్రపంచ నెంబర్ 2 నకామురా, నెంబర్ 3 కరౌనా ఇద్దర్నీ ప్రజ్ఞానంద ఓడించాడు. దీనిపై అతని తండ్రి చాలా సంతోషం వ్యక్తం చేశాడు.
'ఈ విజయంతో మేం చాలా సంతోషంగా ఉన్నాం. అత్యున్నత శిఖరం చేరాలంటే ఎన్నో అడ్డంకులు ఎదుర్కోవాలి కదా. ఈ ప్రదర్శన మాకు చాలా ఆనందాన్నిస్తోంది' అని చెప్పాడు. ప్రజ్ఞానంద ప్రతిరోజూ తనతో ఫోన్‌లో మాట్లాడతాడని ఆయన వెల్లడించాడు. అలాగే ప్రజ్ఞానంద తల్లి తనతోపాటు అజెర్‌బైజాన్‌లోనే ఉన్నారు.
'నేను తన ఆటలో వేలు పెట్టను. రోజు ఎలా గడిచింది? తిన్నావా? లేదా? ఇలాంటి సంభాషణే మా ఇద్దరి మధ్య జరుగుతుంది. ఆటలో ఇలా చేయాలి, అలా చేయాలి అని నేను చెప్పను. అది అతని కోచ్ పని. నాది కాదు. నేను అదే నమ్ముతా. అందుకే ఆటలో కలగజేసుకోను' అని ప్రజ్ఞానంద తండ్రి రమేష్‌బాబు పేర్కొన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications