Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గోల్ కీపర్‌కు గోల్డెన్ ఛాన్స్..!!

PR Sreejesh: భారత హాకీ జట్టు గోల్ కీపర్ పీఆర్ శ్రీజేష్‌కు అరుదైన గుర్తింపు లభించింది. పారిస్ ఒలింపిక్స్ 2024 పురుషుల హాకీలో భారత్‌కు రజత పతకం సాధించి పెట్టడంలో కీలక పాత్ర పోషించిన ఈ మలయాళీ.. జాయింట్ ఫ్లాగ్‌బేరర్‌గా నిలువబోతోన్నాడు. ఈ బిగ్గెస్ట్ స్పోర్ట్స్ ఈవెంట్ క్లోజింగ్ సెరెమనిలో సందర్భంగా జాతీయ పతకాన్ని రెపరెపలాడించబోతోన్నాడు.

మరో రెండు రోజుల్లో ఒలింపిక్స్ ముగియబోతోంది. బ్రిటీష్ సమ్మర్ టైమ్ జోన్ ప్రకారం ఈ నెల 11వ తేదీన రాత్రి 8 గంటలకు ముగింపు వేడుకలు ఆరంభమౌతాయి. రాత్రి 10:30 గంటల వరకు కొనసాగనున్నాయి. అంగరంగ వైభవంగా ఈ సెలబ్రేషన్స్‌ను నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేసింది ఒలింపిక్స్ కమిటీ.

PR Sreejesh is joint flagbearer with Manu Bhaker for the Paris Olympic 2024 Closing Ceremony

ఈ సెలబ్రేషన్స్‌లో భారత్ టీమ్‌కు జాయింట్ ఫ్లాగ్ బేరర్‌గా వ్యవహరించనున్నాడు పీఆర్ శ్రీజేష్. ఈ మేరకు భారత ఒలింపిక్స్ కమిటీ ఓ ప్రకటన విడుదల చేసింది. మనూ భాకర్‌తో కలిసి జాయింట్ ఫ్లాగ్ బేరర్‌గా ఆయనను నామినేట్ చేసినట్లు ఐఓఏ ఛైర్ పర్సన్ పీటీ ఉషా వెల్లడించారు.

కొద్దిసేపటి కిందటే పీటీ ఉషా విలేకరులతో మాట్లాడారు. శ్రీజేష్‌ను నామినేట్ చేయడానికి ముందు ఆయనతో మాట్లాడానని, జాయింట్ ఫ్లాగ్ బేరర్‌గా నామినేట్ చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించగానే సంతోషాన్ని వ్యక్తం చేశాడని అన్నారు. చివరి మ్యాచ్ ఆడిన తనకు దక్కిన ఓ లైఫ్ టైమ్ అఛీవ్‌మెంట్‌గా భావిస్తున్నానని వ్యాఖ్యానించినట్లు చెప్పారు.

ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలను ముద్దాడిన మనూ భాకర్‌ను ఫ్లాగ్ బేరర్‌గా ఇదివరకే నామినేట్ చేసింది ఐఓఏ. మహిళలు, పురుషుల అథ్లెట్ల బృందానికి ఆమె ప్రధాన ఫ్లాగ్‌బేరర్‌గా ఉండబోతోన్నారు. పురుషుల టీమ్‌ తరఫున తాజాగా నయా గోల్ పోస్ట్ వాల్.. శ్రీజేష్ నామినేట్ అయ్యారు.

Story first published: Friday, August 9, 2024, 15:33 [IST]
Other articles published on Aug 9, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+