For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

200 మీటర్ల విభాగంలో మరో స్వర్ణం సాధించిన హిమదాస్

Poznan Athletics Grand Prix: Indian sprinter Hima Das wins gold 200m race

భారత స్టార్‌ స్ప్రింటర్ హిమదాస్ మరోసారి సత్తా చాటింది. వారం వ్యవధిలో అంతర్జాతీయ టోర్నమెంట్‌లో రెండో స్వర్ణ పతకాన్ని సాధించింది. పొలండ్ వేదికగా జరుగుతున్న కుట్నో అథెటిక్స్ మీట్‌లో హిమదాస్ పసిడి పతకం సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన మహిళల 200 మీటర్ల రేసులో హిమదాస్ 23.97 సెకండ్లలో గమ్యాన్ని చేరి అగ్రస్థానంలో నిలిచింది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

భారత్‌కే చెందిన విస్మయ 24.06 సెకన్లలో రేసును ముగించి రజత పతకం దక్కించుకుంది. ఇక పురుషుల 200 మీటర్ల రేసులో భారత అథ్లెట్‌ మహ్మద్‌ అనాస్‌ (21.18 సెకండ్లు) స్వర్ణం సాధించాడు. 400 మీటర్ల పురుషుల హర్డిల్స్‌లో జాబీర్ స్వర్ణం గెలుచుకోగా.. జితిన్ కాంస్యం దక్కించుకున్నాడు.

గత మంగళవారం పొజ్నాన్‌ అథ్లెటిక్స్‌ గ్రాండ్‌ప్రి మీట్‌లోనూ హిమదాస్ 200 మీటర్ల విభాగంలో స్వర్ణం సాధించింది. గత కొన్ని నెలలుగా వెన్ను నొప్పితో బాధపడుతున్న హిమదాస్.. ఆ నొప్పిని ఏ మాత్రం ఖాతరు చేయకుండా పొజ్నాన్‌ అథ్లెటిక్స్‌ గ్రాండ్‌ప్రి మీట్‌లో పాల్గొని స్వర్ణ పతకం సాధించడం విశేషం. ఈ ఏడాది హిమదాస్ పాల్గొన్న తొలి 200 మీటర్ల రేసు ఇదే. ఈ రేసును 23.10 సెకన్లలో పూర్తి చేసిన హిమదాస్ ఈ ఏడాది వ్యక్తిగతంగా అత్యుత్తమ రికార్డును నెలకొల్పింది. మొత్తంగా హిమదాస్ వారం వ్యవధిలో రెండో స్వర్ణ పతకాన్ని సాధించింది.

Story first published: Tuesday, July 9, 2019, 8:51 [IST]
Other articles published on Jul 9, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+