Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఢిల్లీ శివార్లలో ఐదుగురు అథ్లెట్లు దుర్మరణం

Powerlifting world champion Saksham Yadav, 4 others succumb to road accident injury

హైదరాబాద్: ఢిల్లీ శివార్లలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పవర్‌లిఫ్టింగ్‌లో ప్రపంచ చాంపియన్‌ సాక్షం యాదవ్‌ సహా ఐదుగురు పవర్‌ లిఫ్టర్లు మృతి చెందారు. కాగా, తీవ్రగాయాలతో మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు ఢిల్లీ- హరియాణా మధ్య సింగూ బోర్డర్‌లో ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు. వివరాల్లోకెళితే.. సక్షం యాదవ్‌, మరో నలుగురు లిఫ్టర్లు హరీష్‌ రాయ్‌, టింకా, యోగేశ్‌, సౌరభ్‌లతో కలిసి పానిపట్‌ నుంచి ఢిల్లీకి స్విప్ట్‌ డిజైర్‌ కారులో వెళుతున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది.

తెల్లవారుజామున పొగమంచు తీవ్రత కారణంగా ముందు నుంచి వస్తున్న వాహనాలను సరిగా గుర్తించలేకపోవడంతో కారు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న కరెంట్‌ స్థంభాన్ని డీకొట్టింది. ప్రమాదం ధాటికి కారు నుజ్జునుజ్జయింది. ఈ ఘటనలో నలుగురు లిఫ్టర్లు అక్కడికక్కడే మృతిచెందారు. సక్షం యాదవ్‌ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ సాయంత్రం మరణించాడు.

ప్రమాద వివరాల సేకరణ కోసం సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. 29ఏళ్ల సాక్షం.. గతేడాది మాస్కోలో జరిగిన ప్రపంచ పవర్‌లిఫ్టింగ్‌ చాంపియన్‌షి్‌పలో స్వర్ణ పతకం సాధించాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Monday, January 8, 2018, 11:22 [IST]
Other articles published on Jan 8, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+