నాకు అన్యాయం: కెసిఆర్‌తో హేమలత మొర (ఫొటో)
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లికి చెందిన పవర్ లిఫ్టర్ సూర్యవంశి హేమలత గురువారంనాడు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును కలిశారు. ఆమె 2002 ఆసియా క్రీడల్లో స్వర్ణపతకం సాధించింది.
తనకు జరిగిన అన్యాయాన్ని హేమలత కెసిఆర్‌కు విన్నవించుకుంది. తాను పవర్ లిఫ్టింగ్‌లో స్వర్ణపతకం సాధించినప్పటికీ ఆ తర్వాత జరిగిన అంతర్జాతీయ క్రీడలకు తనను ఎంపిక చేయలేదని ఆమె ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు.

తన జీవితాన్ని అంతా క్రీడల శిక్షణకే దారపోసి, ఇప్పుడు పేదరికాన్ని అనుభవిస్తున్నానని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. దీంతో అన్ని విధాలుగా ఆదుకుంటానని ముఖ్యమంత్రి కెసిఆర్ సూర్యవంశి హేమలతకు హామీ ఇచ్చారు.
ప్రభుత్వం తరఫున రూ. 25 లక్షల ఆర్థిక సహాయం అందిస్తామని ఆయన చెప్పారు. ఇంటి స్థలంతో పాటు ప్రభుత్వం తరఫున ఇల్లు మంజూరు చేస్తామని, క్రీడాకారులకు శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వ ఉద్యోగం కూడా కల్పిస్తామని ఆయన చెప్పారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications