Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నాడు బాక్సింగ్ ఛాంపియన్: నేడు స్వీపరయ్యాడు

కోల్‌కతా: 1987లో జాతీయ స్థాయి బాక్సింగ్ ఛాంపియన్‌‌గా, 1992లో రన్నరప్‌గా నిలిచిన క‌ృష్ణ రౌత్ నేడు స్వీపర్‌గా మారిపోయారు. ఎన్ని విన్నపాలు చేసినా ప్రభుత్వాలు, అధికారులు పట్టించుకోకపోవడంతో పొట్టపోసుకోవడానికి చివరకు స్వీపర్‌గా మారిపోయాడు.

ప్రస్తుతం పశ్చిమబెంగాల్, హౌరా మున్సిపల్ కార్పొరేషన్‌లో స్వీపర్‌గా పని చేస్తున్నాడు. రోజుకు రూ. 232 సంపాదిస్తూ చాలీచాలని జీతంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. భార్య, పిల్లలకు కడుపునిండా తిండి కూడా పెట్టలేకపోతున్నాడు.

Poverty makes national boxer work as sweeper in Kolkata

అతనికి క్షయతో బాధపడుతున్న సోదరుడు కూడా ఉన్నాడు. ఇంత పేదరికంలోనూ రోజూ రెండు గంటలు స్థానిక యువకులకు బాక్సింగ్‌లో శిక్షణ ఇస్తుండటం గమనార్హం. రౌత్ కథనాన్ని మీడియా సంస్థలు ప్రసారం చేయడంతో బాక్సర్ సుశీల్ కుమార్ స్పందించారు.

చేయూతనందించేందుకు ముందుకొచ్చారు. ఒకప్పుడు జాతికి వన్నె తెచ్చిన రౌత్‌లాంటి ఆటగాళ్ళను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలు, ప్రజలపై ఉందని సుశీల్ కుమార్ అన్నారు. మీడియా కథనాలపై స్పందించిన రాష్ట్ర మంత్రి అరూప్ రాయ్.. కృష్ణ రౌత్‌ విషయాన్ని మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. అతడ్ని సాయమందిస్తామని తెలిపారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+