Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పారిస్ రండి, దుస్తులిప్పేసి చూపిస్తానంటున్న పూనమ్ పాండే

Poonam Pandey
ముంబై: టీమ్‌ ఇండియా ప్రపంచకప్‌ గెలిస్తే నగ్నంగా కనిపిస్తానన్న మోడల్‌ పూనమ్‌ పాండే పారిస్‌లో ప్రదర్శన ఇస్తానని చెబుతోంది. భారత్‌లో వివాదాలు చుట్టుముడతాయనుకుంటే పారిస్‌ను వేదికగా ఎంచుకుందామని సూచిస్తోంది ఆమె. కప్‌ గెలిస్తే నగ్న ప్రదర్శన ఇస్తానన్న పూనమ్‌, అందుకు అనుమతివ్వాలంటూ బీసీసీఐకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆమెపై చర్యలు తీసుకోవాలంటూ భోపాల్‌ కోర్టులో కేసు దాఖలైంది.

పూనమ్‌పై చర్యలకు బీజేపీ మహిళా మోర్చా ముంబయి పోలీస్‌ కమిషనర్‌ అరుప్‌ పట్నాయక్‌కు లేఖ రాసింది. కేసులు, బెదిరింపులకు భయపటడనంటున్న పూనమ్‌ ''విదేశాల్లో చాలా యూనివర్సిటీలు చేసిన పరిశోధనల్లో నగ్న ప్రదర్శన ప్రజల్లో ఉత్తేజాన్ని పెంచుతుందని, క్రీడల్లో లేదా మరే ఇతర రంగంలోనైనా రాణించడానికి దోహదం చేస్తుందని తేలింది'' అని పూనమ్‌ చెప్తోంది. ప్రవేట్‌గా వయోజనుల అనుమతితో నగ్న ప్రదర్శనిస్తే అది ఫలితాలు చూపిస్తుందని, స్ఫూర్తిగా పనిచేస్తుందని, ఈ విషయం విశ్వవిద్యాలయాల అధ్యయనాల్లో కూడా వెల్లడైందని ఆమె అంటోంది.
Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+