
టోక్యో: జపాన్ వేదికగా సాగుతోన్న ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌లో భారత్.. మరో ప్రిస్టేజియస్ ఈవెంట్‌లో పాల్గొనబోతోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఇంకొన్ని గంటల్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. భారత్‌కు బాగా వచ్చిన ఈవెంట్.. బాక్సింగ్. మహిళా బాక్సర్లు దేశ పరువు ప్రతిష్ఠలను కాపాడేలా ఈ శ్రమిస్తోన్నారు ఇందులో. ఇప్పటికే ఇద్దరు మహిళా బాక్సర్లు మేరీకోమ్, లవ్లీనా బొర్గోహెయిన్ ముందడుగు వేశారు. తాము ఎదుర్కొన్న తొలి రౌండ్ పోటీల్లో ఘన విజయాన్ని నమోదు చేశారు. మలి రౌండ్లల్లో ప్రత్యర్థులను మట్టి కరిపించడానికి సమాయాత్తమౌతోన్నారు.
మరో స్టార్ విమెన్ బాక్సర్.. పూజా రాణి తన ప్రతాపాన్ని చూపడానికి సన్నద్ధమౌతోన్నారు. ఈ మధ్యాహ్నం 2:33 నిమిషాలకు ఈ బౌట్ ఆరంభం కానుంది. రౌండ్ 16లో ఆమె అల్జీరియాకు చెందిన ఇచ్రక్ ఛైబ్‌ను ఢీ కొట్టనున్నారు. ఈ బౌటను గెలిస్తే పూజారాణి క్వార్టర్ ఫైనల్స్‌కు అడుగు పెట్టడం ఖాయం. మహిళల 75 కేజీల మిడిల్ వెయిట్ కేటగిరీలో ఆమె తలపడుతున్నారు. కొకుగికన్ బాక్సింగ్ ఎరినాలో ఈ బౌట్ ప్రారంభమౌతుంది. కాగా మేరీ కోమ్-51, సిమ్రన్‌జీత్ కౌర్-60, లవ్లీనా బోర్గొహెయిన్-69 కేజీల కేటగిరీలకు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నారు.

ఆసియా ఛాంపియన్‌షిప్ టోర్నమెంట్‌లో పూజారాణి స్వర్ణ పతకాన్ని సాధించారు. దుబాయ్‌లో జరిగిన ఈ ఈవెంట్‌లో ఆమె ఉజ్బెకిస్తాన్‌కు చెందిన మౌలేడా మౌలోనువాను ఓడించారు. ఛాంపియన్‌గా నిలిచారు. ఒలింపిక్స్‌లో పతకాన్ని సాధించాలనేది తన కల అని, దాన్ని నెరవేర్చుకోవడానికి శక్తివంచన లేకుండా శ్రమిస్తున్నానని పూజారాణి చెప్పుకొచ్చారు. హార్డ్‌వర్క్ చేయడమే తన పని.. మిగిలినదంతా ఆ దేవుడి మీదే భారం వేశానని వ్యాఖ్యానించారు. బాక్సింగ్ విభాగంలో మలి రౌండ్లకు చేరుకున్న మేరీ కోమ్, లవ్లీనా బొర్గోహెయిన్‌లపై ఇప్పటికే పలు అనేక అంచనాలు ఉన్నాయి.