న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చిన్నారి కోసం: ఒలింపిక్స్‌లో వచ్చిన పతకం అమ్మేశాడు

రియో డీ జెనిరో: నాలుగేళ్లకోసారి జరిగే ఒలింపిక్స్‌లో పతకం సాధించడం సాధించడం మామూలు విషయం కాదు. ఆ పతకం కోసం ఏళ్ల తరబడి ఆటగాళ్లు కష్టపడతారు. అలా.. కష్టపడి సాధించిన మెడల్‌ను అమ్మకానికి పెట్టడం గమనార్హం. అయితే అది మంచి పని కోసం.

క్యాన్సర్‌తో బాధపడుతున్న ఓ బాలుడికి చికిత్స కోసం ఓ పోలిష్ అథ్లెట్‌ తనకు వచ్చిన పతకాన్ని అమ్మేశాడు.పొలాండ్‌ డిస్కస్‌ త్రో ఆటగాడు పియోటర్‌ రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించాడు. మూడేళ్ల తన కుమారుడు కంటి క్యాన్సర్‌తో బాధపడుతున్నాడని ఓ మహిళ నుంచి పియోటర్‌కు లేఖ వచ్చింది.

Polish athlete puts Olympic medal up for sale to help boy with cancer

దీంతో పీయోటర్ బాలుడికి సహాయం చేయాలనుకున్నాడు. అందుకోసం తన పతకాన్ని వేలానికి పెట్టాడు. ఈ విషయాన్ని పియోటర్‌ ఇటీవల ఫేస్‌బుక్‌లో పెట్టాడు. ఈ పోస్ట్‌ పెట్టిన కొద్ది సేపటికే తన పతకం అమ్ముడుపోయిందని ఆ డబ్బును చిన్నారి చికిత్స కోసం అందించనున్నట్లు పియోటర్‌ పోస్ట్ చేశాడు. చిన్నారి చికిత్స కోసం ఉపయోగపడే ఈ రజత పతకం స్వర్ణం కంటే గొప్పదన్నాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X