Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పాంటింగ్ పని ముగిసింది

Ricky Ponting
సిడ్నీ: వరుసగా నాలుగు వన్డేల పరాజయం ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్ కెరీర్ పై ప్రభావం చూపింది. న్యూజిలాండ్ తో శుక్రవారం జరిగే రెండో వన్డేలో పాంటింగ్ ఆడడం లేదు. దక్షిణాఫ్రికాతో ఆస్ట్రేలియా వన్డే సిరీస్ ను కోల్పోవడమే కాకుండా న్యూజిలాండ్ తో జరిగిన తొలి వన్డేలో పరాజయం పాలైంది. ఈ సిరీస్ మొత్తం నుంచి పాంటింగ్ ను తప్పించే అవకాశం ఉంది. ఆస్ట్రేలియా సెలెక్టర్లు పాంటింగ్ కు విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది. ఇండియాతో కూడా ఆస్ట్రేలియా సిరీస్ ను కోల్పోయింది.

మైకెల్ క్లార్క్ పాంటింగ్ స్థానంలో నాయకత్వ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. పాంటింగ్ కు విశ్రాంతినిచ్చే విషయంపై చర్చిస్తున్నట్లు సెలెక్టర్ల చైర్మన్ ఆండ్ర్యూ హిల్డిచ్ చెప్పారు. వరుసగా ఆడడం వల్ల పాంటింగ్ అలసిపోయినట్లు కనిపిస్తున్నారు. న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో రన్నవుట్ కావడం దానికి నిదర్శనమని అంటున్నారు.
Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+