Tokyo Olympics 2021: ఎంత మంచి రోజు.. ఎంత మంచి విజయం! మీరా.. భారత్ గర్వపడుతోంది!

టోక్యో: ఒలింపిక్స్ 2021లో తొలి రోజే భారత్ పతకాల బోణీ కొట్టింది. వెయిట్‌లిఫ్టింగ్ 49 కేజీల విభాగంలో మీరాబాయ్ చాను సిల్వర్ మెడల్ గెలిచింది. స్నాచ్, క్లీన్ అండ్ జెర్క్ కలిపి ఆమె 202 కేజీల బరువు ఎత్తింది. చైనా వెయిట్‌లిఫ్టర్ హౌ ఝిఝి 210 కేజీలతో గోల్డ్ మెడల్ గెలవగా.. ఇండోనేషియాకు బ్రాంజ్ మెడల్ దక్కింది. 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో కరణం మల్లీశ్వరి తర్వాత వెయిట్‌లిఫ్టింగ్‌లో మెడల్ గెలిచిన తొలి అథ్లెట్‌గా మీరా నిలిచింది. సిడ్నీ ఒలింపిక్స్‌లో మల్లీశ్వరి బ్రాంజ్ మెడల్ గెలవగా.. ఇప్పుడు మీరాబాయ్ సిల్వర్‌తో మెరిసింది.
దేశంను గర్వపడేలా చేశారు:
భారత్‌కు తొలి పతకాన్ని అందించిన వెయిట్‌లిఫ్టర్ మీరాబాయ్ చానుపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీతో పాటు హోంమంత్రి అమిత్ షా, మణిపూర్ సీఎం బీరేన్ సింగ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, అస్సాం, కర్ణాటక, పంజాబ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర క్రీడా ప్రముఖులు ట్విటర్లో ఆమెను ప్రశంసించారు. ఇండియాను సగర్వంగా తలెత్తుకునేలా చేశావంటూ ఆకాశానికెత్తారు. 'వెయిట్‌లిఫ్టింగ్‌లో అద్భుతమైన ప్రదర్శన. గాయం తర్వాత మీరు చేసిన పోరాటం అసమానం. భారత్ కోసం పతకం గెలిచారు. దేశంను గర్వపడేలా చేశారు' అని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ట్వీట్ చేశారు.
ప్రతి భారతీయుడికి స్ఫూర్తి దాయకం:
'టోక్యో ఒలింపిక్స్ 2021లో మీరాబాయి చాను అద్భుతమైన ప్రదర్శనతో యావత్ భారతం ఉప్పొంగిపోతోంది. వెయిట్‌లిఫ్టింగ్‌లో రజత పతకం సాధించిన ఆమెకు అభినందనలు. ఆమె విజయం ప్రతి భారతీయుడికి స్ఫూర్తి దాయకం' అని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. 'టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకం గెలిచి భారత పతకాల పట్టికను తెరిచిన వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చానుకు హృదయపూర్వక అభినందనలు' రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పేర్కొన్నారు. 'ఒలింపిక్ క్రీడల్లో వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో మీరాబాయి చాను రజత పతకం సాధించడం గర్వంగా ఉంది. భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలి' అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ట్వీటారు.

మీరా.. భారత్ గర్వపడుతోంది:
# తొలి రోజే.. తొలి పతకం. మీరా.. భారత్ గర్వపడుతోంది - క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్
# టోక్యో ఒలింపిక్స్ ఆరంభంలోనే దేశానికి తొలి పతకం అందించిన మీరాబాయి చానుకు అభినందనలు. తన పుత్రికను చూసి భారతావని గర్వపడుతోంది - కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ
# టోక్యోలో భారత్ తొలి పతకం నమోదు చేసింది. వెయిట్ లిఫ్టింగ్‌లో మీరాబాయి చాను రజత పతకం అందుకుంది. యావత్ భారతావని గర్వపడే విషయం. అభినందనలు చాను - కేంద్రమంత్రి కిరణ్ రిజిజు
# ఎంత మంచి రోజు! భారత్‌కు ఎంత మంచి విజయం. 49 కిలోల విభాగంలో వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను రజతాన్ని ముద్దాడింది. దీంతో భారత పతకాల పట్టిక మొదలైంది. యావత్ దేశాన్ని గర్వపడేలా చేశావు చాను - మణిపూర్ సీఎం
# ఒలింపిక్స్‌లో భారత్‌కు మెరుపు ఆరంభం. తన అద్భుతమైన ప్రదర్శనతో తొలి పతకాన్ని అందించిన మీరాబాయి చానుకు హృదయపూర్వక అభినందనలు - తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్
# అభినందనలు మీరాబాయి చాను. నీ విజయం ప్రతి భారతీయుడికి గర్వకారణం - ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications