Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ముగిసిన కామన్‌వెల్త్‌: పతక విజేతలకు ప్రధాని, రాష్ట్రపతి ప్రశంసలు

PM Modi hails Indian team’s success at 2018 Commonwealth Games

హైదరాబాద్: గోల్డ్‌కోస్ట్‌లో వేదికగా 12 రోజులపాటు జరిగిన కామన్‌వెల్త్‌ గేమ్స్ అట్టహాసంగా ముగిశాయి. ఆదివారం జరిగిన ముగింపు ఉత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, ఆట పాటలతో కళాకారులు అలరించారు. భారత్‌ తరఫున మహిళా బాక్సర్‌ మేరీకోమ్‌ భారత జెండాని చేతపట్టుకుని దేశ క్రీడాకారుల బృందానికి నాయకత్వం వహించింది.

ఈ కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ మెరిసింది. 66 పతకాలతో మూడో స్ధానంలో నిలిచింది. దీంతో 21వ కామన్వెల్త్ గేమ్స్‌ను విజయవంతంగా ముగించడంలో సహకరించిన అందరికీ నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు. కామెన్వెల్త్‌‌లో పతకాలు గెలిచిన క్రీడాకారులకు భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని మోడీతోపాటు పలువురు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.

ఆఖరి రోజు బ్యాడ్మింటన్‌లో భారత్‌ నాలుగు పతకాలు

ఆఖరి రోజు బ్యాడ్మింటన్‌లో భారత్‌ నాలుగు పతకాలు

మొత్తం 12 రోజుల పాటు జరిగిన ఈ కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌ 26 స్వర్ణాలు, 20 రజత పతకాలు, 20 కాంస్య పతకాలను కైవసం చేసుకుంది. ఆఖరి రోజు బ్యాడ్మింటన్‌లో భారత్‌ నాలుగు పతకాలు గెలుచుకుంది. మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్‌ స్వర్ణం నెగ్గగా.. సింధు రజతంతో సరిపెట్టుకుంది. మానికా బత్రా నాలుగు పతకాలతో అత్యంత విజయవంతమైన క్రీడాకారిణిగా నిలిచింది.

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఇలా

మహిళల సింగిల్స్‌ బ్యాడ్మింటన్‌ విభాగంలో స్వర్ణ, రజత పతకాలు సాధించిన సైనా నెహ్వాల్‌, పీవీ సింధులకు శుభాకాంక్షలు. మీరిద్దరూ భారతమాత ముద్దు బిడ్డలు. మీరిలాగే కొనసాగించాలని కోరుకుంటున్నాను. పురుషుల సింగిల్స్‌ విభాగంలో రజతం సాధించిన శ్రీకాంత్‌, స్వ్కాష్‌ డబుల్స్‌లో రజతం సాధించిన దీపిక పల్లికల్‌-జ్యోత్స్న చిన్నప్పలకు శుభాకాంక్షలు.

పతకాలు సాధించిన వారికి ప్రధాని మోడీ శుభాకాంక్షలు

మిక్స్‌డ్‌ డబుల్స్‌లో కాంస్య పతకం సాధించిన మనికా బాత్రా, జ్ఞానశేఖరన్‌లను చూసి గర్విస్తున్నాను. అందరికీ శుభాకాంక్షలు

ట్విట్టర్‌లో వీరేంద్ర సెహ్వాగ్‌

భవిషత్‌ తరాలకు రోల్‌ మోడల్స్‌గా అవతరించనున్న సైనా నెహ్వాల్‌, సింధూలకు శుభాకాంక్షలు. మిమ్మల్ని చూసి భారత బ్యాడ్మింటన్‌ గర్విస్తోంది. భవిష్యత్తులో మీరు మరింత మెరుగ్గా రాణించాలి

Story first published: Monday, April 16, 2018, 9:41 [IST]
Other articles published on Apr 16, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+