గేల్ సహా వీళ్లే: అదరగొడతారనుకుంటే, ఈసారి ఏమైందో?
న్యూఢిల్లీ: ఐపీఎల్ 8లో అదరగొడుతారనుకున్న పలువురు ఆటగాళ్లు ఆశించిన స్థాయిలో ఏమాత్రం ఆడటం లేదు. రూ.16 కోట్లు పలికిన యువరాజ్ సింగ్, రూ.ఏడున్నర కోట్లు పలికిన మాథ్యూస్, పంజాబ్ ఆటగాళ్లు మాక్స్‌వెల్, మిల్లర్‌లు ఈసారి విఫలమవుతున్నారు.
బెంగళూరు ఆటగాడు క్రిస్ గేల్‌లో గత వైభవం కనిపించడం లేదు. బెంగళూరు ఓ మ్యాచ్‌లో అతనిని పక్కన పెట్టిందంటే అర్థం చేసుకోవచ్చు. గత ఐపీఎల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ లిస్టుల్లో ఎప్పుడూ గేల్ ఫస్ట్ లేదా టాప్ ఆటగాళ్లలో ఉండేవాడు. ఈసారి అలా లేడు.
మిశ్రా, డెల్ స్టెయిన్, సంజు శ్యాంసన్, అంబటి రాయుడు, దినేష్ కార్తీక్ తదితరులు విఫలమవుతున్నారు. అయితే, ఇప్పటి వరకు సగం మ్యాచులు పూర్తయ్యయి. మిగతా సగంలో వారు ఏ మేరకు రాణిస్తారో చూడాలి.

యువరాజ్ సింగ్
యువరాజ్ సింగ్ ఏడు మ్యాచులు ఆడి 124 పరుగులు మాత్రమే చేశాడు. అతను అత్యధికంగా రూ.16 కోట్లు పలికాడు. గత సీజన్లోను అతను ఆశించిన స్థాయిలో రాణించలేదు. ఈసారి కూడా ఇప్పటి వరకు ఫాం అందుకోక అభిమానులను నిరాశపరిచాడు. ఢిల్లీ తరఫున ఆడుతున్న లెగ్ స్పిన్ర్ మిశ్రా కూడా పేలవ ప్రదర్శన చేస్తున్నాడు. అతను ఏడు మ్యాచుల్లో ఆరు వికెట్లు మాత్రమే తీసాడు.

డెల్ స్టెయిన్
డెల్ స్టెయిన్.. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఏమాత్రం ప్రభావం చూపడం లేదు. అతను మూడు మ్యాచులు ఆడి మూడు వికెట్లు మాత్రమే తీశాడు. సగటు 29గా ఉంది. ఎనిమిది రన్ రేటుతో పరుగులిచ్చాడు. దీంతో అతనిని డగౌట్‌కు పరిమితం చేస్తున్నారు.

మిల్లర్, మాక్స్‌వెల్
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టులో అసాధారణ ఆటగాళ్లున్నారు. మాక్స్ వెల్, మిల్లర్‌లు గత సీజన్లో మెరుపులు మెరిపించారు. కానీ ఈసారి అది కనిపించడం లేదు. మాక్స్ వేల్ 5 మ్యాచులు ఆడి 62 పరుగులు చేశాడు. మిల్లర్ 6 మ్యాచులు ఆడి 124 పరుగులు చేశాడు. సెహ్వాక్ కూడా ఆకట్టుకోవడం లేదు.

క్రిస్ గేల్
పంజాబ్ జట్టు తరఫున ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ మిచెల్ జాన్సన్ విఫలమవుతున్నాడు. అతను ఏడు మ్యాచుల్లో 8 వికెట్లు మాత్రమే తీశాడు. ముంబై జట్టులో కీలక ఆటగాడిగా ఉన్న అంబటి రాయుడు ఈసారి చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. క్రిస్ గేల్ పూర్తిగా విఫలమయ్యాడని చెప్పుకోనప్పటికీ.. అతను ఆశించిన స్థాయిలో ఆడటం లేదు. రాజస్థాన్ ఆటగాడు సంజూ శ్యాంసన్ కూడా విఫలమవుతున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications