న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జులై 20 నుంచి ప్రొ కబడ్డీ లీగ్ సీజన్‌-7

PKL 2019: Start date of VIVO Pro Kabaddi Season VII announced

ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్‌) ఏడవ సీజన్‌కు ముహూర్తం ఖరారైంది. పీకేఎల్‌ ఈ ఏడాది జులై 20న ప్రారంభమవుతుందని లీగ్ నిర్వాహకులు మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ సీజన్‌లో మ్యాచ్‌లు రాత్రి 7.30కు ఆరంభమవుతాయని నిర్వాహకులు తెలిపారు. మ్యాచ్‌లు ఇంతకు ముందు రాత్రి 8 గంటలకు ఆరంభమయ్యేవి.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ప్రొ కబడ్డీ లీగ్ సీజన్‌-7కు అన్ని సిద్ధమయ్యాయి. జులై-అక్టోబర్ నెలలో మళ్లీ వస్తున్నాం' అని లీగ్ కమీషనర్, సీఈఓ అనుపమ్ గోస్వామి తెలిపారు. ఈ సీజన్‌లో మొత్తం 12 జట్లు పాల్గొంటున్నాయి. స్టార్ రైడర్లు రాహుల్ చౌదరి, సిద్దార్థ్ దేశాయ్, మోను గోయత్, సందీప్ నర్వాల్ వంటి పలువురు ఈ సీజన్‌లో కొత్త జట్లకు ఆడుతున్నారు. పర్దీప్ నర్వాల్, పవన్ కుమార్, అజయ్ ఠాకూర్, ఫజల్ వంటి ఆటగాళ్లు పాత జట్లకు ఆడుతున్నారు.

బెంగళూరు బుల్స్‌ డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగనుంది. గత సీజన్‌-6లో స్టార్ రైడర్ అజయ్ ఠాకూర్ నేతృత్వంలోని బెంగళూరు బుల్స్ విజేతగా నిలిచింది. గుజరాత్‌ ఫార్చూన్‌ జెయింట్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 38-33తో తేడాతో బెంగళూరు విక్టరీ సాధించి కప్ ఎగరేసుకుపోయింది. సీజన్-5లో కూడా గుజరాత్‌ ఫార్చూన్‌ జెయింట్స్‌ రన్నరప్‌తో సరిపెట్టుకుంది.

Story first published: Wednesday, May 29, 2019, 13:16 [IST]
Other articles published on May 29, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X