క్రీడాస్ఫూర్తి ఇలా: విశాఖలో ఒలింపిక్ డే రన్ (పిక్చర్స్)
విశాఖపట్నం: ఒలింపిక్ గేమ్స్‌లో ప్రాతినిథ్యం వహించాలని ప్రతి క్రీడాకారుడు కోరుకుంటాడని, అయితే సంకల్పం, అంకితభావంతో పట్టుదలగా సాధన చేస్తే ఆశించిన లక్ష్యాన్ని చేరుకోవచ్చునని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జీఎస్ఎన్ రాజు సూచించారు.
ఒలింపిక్ దినోత్సవం సందర్భంగా సోమవారం విశాఖ ఒలింపిక్ అసోసియేషన్ బీచ్‌రోడ్‌లో నిర్వహించిన ఒలింపిక్ పరుగుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై జెండా ఊపి ప్రారంభించారు. క్రీడాకారుల విలువలను చాటిచెప్పే అత్యున్నత టోర్నీగా ఒలింపిక్స్ గేమ్స్ నిలుస్త్తోందనడంలో ఎటువంటి సందేహం లేదని ఆయన అన్నారు.
ఒలింపిక్ క్రీడల ప్రాధాన్యత, ప్రాముఖ్యత గురించి వర్ధమాన, ఔత్సాహిక క్రీడాకారులకు చెప్పాల్సిన బాధ్యత సీనియర్ క్రీడాకారులు, కోచ్‌లపైనే వుందన్నారు. ఏయూలోని విద్యార్థులందరకీ విద్యతో పాటు క్రీడల్లో ప్రవేశించేలా చర్యలు చేపట్టామన్నారు. విశాఖ క్రీడారంగానికి బంగారు భవిష్యత్తు వుందని సిఎంఆర్ అధినేత మావూరి వెంకటరమణ అన్నారు. క్రీడల అభివృద్ధికి తనవంతు నహకారాన్ని అందిస్తానన్నారు.

ఒలింపిక్ డే రన్
క్రీడాకారులు, కోచ్‌లు, క్రీడా సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు కాళీమాత గుడి నుంచి వైఎంసీఏ వరకు ఉత్సాహంగా పరుగు తీశారు.

ఒలింపిక్ డే రన్
ఒలింపిక్ డే రన్‌లో ఏయూ ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎం.శ్యాంబాబు, డీఆర్‌డీఏ పీడీ సత్యసాయి శ్రీనివాస్, వాలీబాల్ ఫెడరేషన్ ప్రతినిధి ఎస్.కోదండరామయ్య, ఒలింపియన్ (వెయిట్ లిఫ్టింగ్) ఎంవీ.మాణిక్యాలు పాల్గొన్నారు.

ఒలింపిక్ డే రన్
ఏపీ వెయిట్‌లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు కంచరాన సూర్యనారాయణ, ఏపీ అథ్లెటిక్స్ సంఘం అధ్యక్షుడు నాగేశ్వరరావు, జిల్లా బాస్కెట్‌బాల్ సంఘం అధ్యక్షుడు, ఒలింపిక్ అసోసియేషన్ విశాఖపట్నం చైర్మన్ టీఎస్ఆర్ ప్రసాద్, సత్యనారాయణ, వెంకటరావు కూడా రన్‌లో పాల్గొన్నారు.

ఒలింపిక్ డే రన్
విశాఖపట్నంలో సోమవారం జరిగిన ఒలింపిక్ డే రన్ అత్యంత ఉల్లాసకరమైన వాతావరణంలో జరిగింది. పలువురు ఈ రన్‌లో పాల్గొన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications