రియో ఒలింపిక్స్‌ను మిస్ అవుతున్న సూపర్ స్టార్లు వీరే
రియో డీ జనెరియో: క్రీడా ప్రపంచంలోనే అతి పెద్ద గేమ్స్‌గా అభివర్ణించే ఒలింపిక్స్ ఆగస్టు 5 నుంచి బ్రెజిల్‌లోని రియో డి జనెరియోలో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. జీవితంలో ఒక్కసారైనా ఒలింపిక్స్‌లో పాల్గొనాలని ప్రతి క్రీడాకారుడు భావిస్తుంటాడు.
రియో ఒలింపిక్స్‌లో పాల్గొనకుండా కొంతమందిని దురదృష్టం వెంటాడితే కొంతమంది తాము చేసిన స్వయం కృపరాధం వల్లే ఈ ఏడాది ఒలింపిక్స్‌కు హాజరు కాలేకపోతున్నారు. వచ్చే నెలలో రియోలో జరగనున్న ఒలింపిక్స్‌కు పలువురు ప్రపంచ స్థాయి ఆటగాళ్లు హాజరు కాలేక పోవడానికి అనేక కారణాలున్నాయి.
ఇందులో ముఖ్యంగా గాయాలు, జికా వైరస్, డోపింగ్ స్కాండల్స్, ఒలింపిక్స్‌కు అర్హత సాధించలేక పోవడం వంటి కారణంగా బ్రెజిల్‌కు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. రియో ఒలింపిక్స్‌లో సుమారు 10,000 మంది అథ్లెట్లు పాల్గొంటారని అంచనా వేస్తున్నారు.
అయితే ఇందులో కొంత మంది స్టార్ ఆటగాళ్లు కూడా ఉండటం అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. రష్యాకు చెందిన ట్రాక్ అండ్ ఫీల్డ్ జట్టు మొత్తం రియో ఒలింపిక్స్‌లో పాల్గొనకుండా నిషేధం విధించారు. మరోవైపు భారత్ నుంచి కూడా పలువురు స్టార్ అథ్లెట్లు రియో ఒలంపిక్స్‌కు హాజరు కావడం లేదు.
రియో ఒలింపిక్స్‌కు హాజరు కాని టాప్ 10 స్టార్ అథ్లెట్ల వివరాలను ఒక్కసారి పరిశీలిస్తే:

రోజర్ ఫెదరర్
స్విస్ టెన్నిస్ సూపర్ స్టార్ రోజర్ ఫెదరర్ సర్జరీ కారణంగా రియో ఒలంపిక్స్‌లో పాల్గొనడం లేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో రోజర్ ఫెదరర్‌కు మోకాలికి శస్త్రచికిత్స ఆపరేష్ జరిగింది. దీని కారణంగా రియో ఒలింపిక్స్‌లో పాల్గొనడం లేదని చెప్పేశాడు.

లియోనల్ మెస్సీ
రియో ఒలింపిక్స్‌లో అర్జెంటీనా పుట్ బాల్ జట్టు కెప్టెన్ లియోనల్ మెస్సీ లేకుండా ఆ జట్టు బరిలోకి దిగుతుంది. జూన్‌లో జరిగిన కోపా అమెరికా ఫైనల్‌లో అర్జెంటీనా జట్టు ఓటమి పాలవ్వడంతో మెస్సీ రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

టైగర్ వుడ్స్
గోల్ఫ్ మాజీ వరల్డ్ నెంబర్ వన్ టైగర్ వుడ్స్ బ్యాక్ పెయిన్ కారణంగా రియో ఒలింపిక్స్‌ను మిస్ అవుతున్నాడు.

ఎలినా ఇసెన్బియెవా
రష్యాకు చెందిన ఒలింపిక్ పోల్ వాల్టర్ ఛాంపియన్ ఎలినా ఇసెన్బియెవా డోపింగ్ స్కాండల్‌లో ఆరోపణలు ఎదుర్కొనడంతో రియో ఒలింపిక్స్‌లో పాల్గొనడం లేదు. ఇక రష్యా ట్రాక్ అండ్ ఫీల్డ్ జట్టు మొత్తాన్ని రియో ఒలింపిక్స్ నుంచి నిషేధించిన సంగతి తెలిసిందే.

లీబ్రాన్ జేమ్స్
యుఎస్ బాస్కెట్ బాల్ జట్టు లీబ్రాన్ జేమ్స్ సేవలను మిస్ అవుతున్నాడు. బాస్కెట్ బాల్ గేమ్ నుంచి అతడు రెస్టు తీసుకున్నాడు.

మేరీకోమ్
భారత్ తరుపు నుంచి ఐదు సార్లు వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌గా నిలిచిన మేరీ కోమ్ రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించలేకపోయారు. 2012లో లండన్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన మేరీ కోమ్ రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించలేక పోయింది.

కోబీ బ్రయాంత్
కోబీ బ్రయాంత్ లేకుండా అమెరికా బాస్కెట్ బాల్ జట్టు రియో ఒలింపిక్స్‌కు బయల్దేరింది. ఇటీవలే అతడు బాస్కెట్ బాల్‌కు వీడ్కోలు పలికాడు.

జాసన్ డే
ఆస్ట్రేలియాకు చెందిన వరల్డ్ నెంబర్ వన్ గోల్ఫర్ జాసన్ డే జికా వైరస్ కారణంగా రియో ఒలింపిక్స్‌కు హాజరు కావడం లేదు.

విజయేందర్ సింగ్
భారత్‌కు చెందిన బాక్సింగ్ స్టార్ విజయేందర్ సింగ్ రియో ఒలంపిక్స్‌లో పాల్గొనడం లేదు. ప్రొఫెషనల్ బాక్సర్లకు అనుమతి ఉన్నప్పటికీ 75 కేజీల విభాగంలో భారత్ నుంచి వికాస్ కృష్ణన్ ఎంపికయ్యారు.

సుశీల్ కుమార్
ఒలింపిక్ కాంస్య పతక విజేత సుశీల్ కుమార్ రియో ఒలింపిక్స్‌లో పాల్గొనడం లేదు. రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించలేకపోవడమే ఇందుకు కారణం. మొదట్లో సుశీల్ కుమార్ ఎంపిక కాకపోవడం పట్ల కాస్తంత వివాదం చెలరేగింది, ఇప్పుడది సర్దుమణిగింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications