సానియా, బోపన్న మిస్: ఒలింపిక్ వేడుకల్లో భారత బృందమిదే (ఫోటోలు)
రియో డీ జనీరో: రియో ఒలింపిక్స్ ఆరంభం అదిరింది. కళ్లు మిరమిట్లు గొలిపే బాణాసంచా వెలుగు ఒకవైపు, అథ్లెట్ల కవాతులు, అలరించే నృత్యాలు మరోవైపు.. వీటన్నిటి మధ్య బ్రెజిల్‌లో రియో ఒలింపిక్స్ ఆరంభ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. భారత కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున 4.00 గంటలకు ప్రఖ్యాత మరానాకా స్టేడియంలో 31వ ఒలింపిక్స్ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.
స్టేడియంలో మొత్తం 6 వేల మంది కళాకారులు ప్రదర్శించిన వివిధ నృత్యాలు ఆరంభ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 207 దేశాలు ఈసారి ఒలింపిక్స్ బరిలోకి దిగాయి. రియో ఒలింపిక్స్‌కు గతంలో ఎన్నడూ లేని విధంగా 118 మంది క్రీడాకారులు బరిలోకి దిగుతున్నారు.
ఒలింపిక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జరిగే మార్చ్‌ఫాస్ట్‌లో భారత్‌కు తొలి వ్యక్తిగత స్వర్ణం అందించిన అభినవ్ బింద్రా జాతీయ జెండాతో భారత బృందానికి నాయకత్వం వహించాడు. ఒలింపిక్స్ చరిత్రలోనే భారత్ తరుపున ఆటగాళ్ల సంఖ్య వంద దాటడం ఇదే తొలిసారి.
రియో ఒలింపిక్స్‌లో భారత్ తరుపున షట్లర్లు అశ్విని పొన్నప్ప, జ్వాలా గుత్తా, పీవి సింధులతో పాటు ఉమెన్స్ హాకీ జట్టు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. మరోవైపు క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ గుడ్ విల్ అంబాసిడర్‌గా ఉన్నారు. రియో ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత బృందానికి మద్దతుగా తెలపనున్నారు.

ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో భారత బృందం
ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో పాల్గొన్న భారత బృందం. భారత కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున 4.00 గంటలకు ప్రఖ్యాత మరానాకా స్టేడియంలో 31వ ఒలింపిక్స్ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. టెన్నిస్ దిగ్గజం లియాండ్ పేస్‌తో భారత ఆటగాళ్లు.

ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో భారత బృందం
ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో పాల్గొన్న భారత బృందం. భారత కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున 4.00 గంటలకు ప్రఖ్యాత మరానాకా స్టేడియంలో 31వ ఒలింపిక్స్ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. టెన్నిస్ దిగ్గజం లియాండ్ పేస్‌తో భారత ఆటగాళ్లు.

ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో భారత బృందం
ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో పాల్గొన్న భారత మహిళల హాకీ జట్టు. భారత కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున 4.00 గంటలకు ప్రఖ్యాత మరానాకా స్టేడియంలో 31వ ఒలింపిక్స్ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.

ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో భారత బృందం
రియో ఒలింపిక్స్ వేడుకల్లో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ గుడ్ విల్ అంబాసిడర్‌గా వ్యవహారిస్తున్నారు. ఈ సందర్భంగా బ్రెజిల్‌లోని రియో డీ జనీరో నగరంలో ఉన్న ప్రఖ్యాత జీసస్ క్రైస్ట్ విగ్రహం వద్ద సచిన్ టెండూల్కర్.

ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో భారత బృందం
ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో పాల్గొన్న భారత బృందం. భారత కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున 4.00 గంటలకు ప్రఖ్యాత మరానాకా స్టేడియంలో 31వ ఒలింపిక్స్ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.

ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో భారత బృందం
ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో పాల్గొన్న భారత బ్యాడ్మింటన్ స్టార్లు పీవీ సింధు, జ్వాలా గుత్తూ, అశ్విని పొన్నప్ప. ఆరంభ వేడుకలకు ముందు ఇలా ఫోటోలకు ఫోజులిచ్చారు.
కాగా మ్యాచ్ కారణంగా రియో ఒలింపిక్స్ ఆరంభ వేడుకలు సానియా మిర్జా, రోహన్ బోపన్న హాజరు కాలేకపోయారు. ఇక ఒలింపిక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో బ్రెజిల్ దేశ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా కార్యక్రమాలను ప్రదర్శించారు.
సాంబా నృత్యాలు, కార్నివాల్ డాన్స్‌లు, వీనుల విందైన సంగీత కార్యక్రమాలతో వీక్షకులను కట్టిపడేశాయి. సూపర్ మోడల్ గిసెలీ బుంద్ చెన్, ట్రాన్స్ జెండర్ బ్యూటీ లీ టీ ఈ వేడుకులకు ప్రధాన ఆకర్షణగా నిలిచారు. బ్రెజిల్‌లో బాగా ప్రజాదరణ పొందిన గర్ల్ ఫ్రమ్ ఇపనెమా పాటకు ఈ ఇద్దరూ ఆడిపాడారు.
బ్రెజిల్ టాప్ సంగీత దర్శకులు కెటానో వెలో సో, గిల్బర్ట్ గిల్‌లు తమ సంగీతంతో హోరెత్తించారు. ర్యాప్ స్టార్లతో కలసి ఫంక్ స్టార్ అనిటా చేసే డాన్స్‌లతో మరకానా హోరెత్తింది. రియో ఒలింపిక్స్ ఆరంభ వేడుకలకు సిటీ ఆఫ్ గాడ్, కాన్‌స్టాంట్ గార్డెనర్ వంటి ప్రఖ్యాత సినిమాలకు దర్శకత్వం వహించిన ఫెర్నాండో మిరెల్లాస్ రూపొందించారు.
లేజర్ షో వీక్షకులను అబ్బురపరిచాయి. 4800 మంది కళాకారులతో భారీ నృత్య ప్రదర్శనలు అహుతులను కట్టిపడేశాయి. ప్రకృతి సిద్ధమైన పచ్చని అమెజాన్ అరణ్యం, పర్యావరణ విశిష్టతను చాటి చెప్పుతూ, బ్రెజిల్ సంప్రదాయాలకు అద్ధం పట్టేలా కళారూపాలు మదిలో నిలిచిపోయాయి.
దాదాపు నాలుగు గంటల పాటు నిర్వహించిన ఈ థీమ్ షో ఆరంభ వేడులకే హైలెట్‌గా నిలిచింది. రియో ప్రారంభోత్సవ కార్యక్రమానికి 70 వేల మంది ప్రేక్షకులు హాజరవుతారని నిర్వాహకులు అంచనా వేశారు. ఇదిలా ఉంటే 100 కోట్ల మంది టీవీల ద్వారా వీక్షించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications