Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆసియా క్రీడలు: మన బంగారాలు వీరే (పిక్చర్స్)

ఇంచియాన్: 17వ ఆసియా క్రీడలకు శనివారం తెర పడుతోంది. ఇంచియాన్‌లో జరుగుతున్న ఆసియా క్రీడలు ముగింపు దశకు వచ్చాయి. ఇప్పటి వరకు భారత్ 57 పతకాలు సాధించింది. వీటిలో 11 స్వర్ణ పతకాలు కాగా, పది వెండి పతకాలు 36 కాంస్య పతకాలు ఉన్నాయి.

అయితే, 2010లో జరిగిన ఆసియా క్రీడల్లో సాధించిన పతకాల కన్నా ఈ ఆసియా క్రీడలో భారత్ సాధించిన పతకాలు తగ్గాయి. ఆ ఆసియా క్రీడల్లో భారత్ 65 పతకాలు సాధించింది. నలుగురు క్రీడాకారులు వ్యక్తిగతంగా స్వర్ణపతకాలు సాధించారు. మరో ఏడు స్వర్ణపతకాలు టీమ్ ఈవెంట్స్‌లో వచ్చాయి.

కబడ్డీలో భారత మహిళలు, పురుషులు క్లీన్ స్వీప్ చేశారు. టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్‌లో హైదరాబాద్ క్రీడాకారిణి సానియా మీర్జా జోడీ స్వర్ణ పతకం సాధించింది.

జితూ రాయ్

జితూ రాయ్

ఇంచియాన్‌లో జరిగిన ఆసియా క్రీడల్లో జీతూ రాయ్ భారత్‌కు తొలి స్వర్ణ పతకం సాధించి పెట్టాడు. అనతు పురుషుల 50 మీటర్ల పిస్టల్ షూటింగులో స్వర్ణపతకం సాధించాడు.

పురుషుల ఆర్చరీ టీమ్

పురుషుల ఆర్చరీ టీమ్

పురుషుల కాంపౌండ్ టీమ్ ఈవెంట్‌లో స్వర్ణపతకం సాధించిన జట్టు సభ్యులు సందీప్ కుమార్, రజత్ చౌహాన్, అభిషేక్ వర్మ (ఎడమ నుంచి కుడికి)

స్క్వాష్ టీమ్

స్క్వాష్ టీమ్

పురుషుల స్క్వాష్ టీమ్ ఈవెంట్‌లో స్వర్ణపతకం సాధించిన గోశాల్, హరీందర్ పాల్ సింగ్ సంధు, కుశ్ కుమార్, మహేష్ మనోంకర్.

రెజ్లింగ్ స్వర్ణం

రెజ్లింగ్ స్వర్ణం

యువ క్రీడాకారుడు యోగేశ్వర్ పురుషుల ఫ్రీస్టయిల్ 65 కెజిల ఫైనల్‌లో విజయం సాధించి స్వర్ణ పతకాన్ని గెలుచుకున్న యోగేశ్వర్ దత్తు

డిస్కస్ త్రో

డిస్కస్ త్రో

మహిళ డిస్కస్ త్రోలో స్వర్ణ పతకం సాధించి భారత గౌరవాన్ని ఇనుమడింపజేసిన సీమా పూనియా ఇలా..

టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్

టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్

టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్‌లో స్వర్ణ పతకం సాధించిన ఆనందంలో సానియా మీర్జా, సాకేత్ మైనేని ఇలా..

బాక్సింగ్

బాక్సింగ్

మహిళ బాక్సింగ్ ఫ్లై వెయిట్ 48-51 కెజీల కెటగిరీ ఫైనల్‌లో విజయం సాధించి స్వర్ణపతకం అందుకున్న మేరీ కోమ్.

హాకీ..

హాకీ..

హాకీలో స్వర్ణ పతకం సాధించిన తర్వాత భారత క్రీడాకారులు ఆనందంలో తేలియాడారు. పాకిస్తాన్‌ జట్టును వారు 4-2 స్కోరుతో పెనాల్టీ షూటవుట్‌లో ఓడించారు. 16 ఏళ్ల తర్వాత భారత్ హాకీలో తిరిగి వైభవాన్ని సాధించింది.

4x400 రిలే

4x400 రిలే

4x400 రిలే రేస్‌లో విజయం సాధించి స్వర్ణ పతకాన్ని దక్కించుకున్న భారత మహిళలు పూవమ్మ, టింటు లుకా, మనదీప్ కౌర్, ప్రియాంక పన్వర్ (ఎడమ నుంచి కుడికి)

కబడ్డీ - మహిళలు

కబడ్డీ - మహిళలు

మహిళల కబడ్డీలో భారత క్రీడాకారుణులు ఎప్పటిలాగే ప్రతిభ చాటారు. వారు స్వర్ణపతకాన్ని సాధించారు.

కబడ్డీ - పురుషులు

కబడ్డీ - పురుషులు

కబడ్డీలో భారత క్రీడాకారుల జట్టు స్వర్ణపతకాన్ని దక్కించుకుంది. ఆసియా క్రీడల్లో ఈ ఆటను ప్రవేశపెట్టినప్పటి నుంచి భారత్ విజయం సాధిస్తూ వస్తోంది.

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+