కామన్వెల్త్: పతకాలు సాధించిన విజేతలు(పిక్చర్స్)
గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ పతకాల పంట పండిస్తోంది. తన చివరి గేమ్స్ ఇవేనని ప్రకటించిన షూటర్ అభినవ్ బింద్రా శుక్రవారం జరిగిన పోటీల్లో బంగారు పతకాన్ని సాధించాడు. బింద్రాతోపాటు మలైక గోయల్, సంతోషి మత్సలు గేమ్స్ పతకాలు సాధించారు. తొలి రోజునే ఏడు పతకాల సాధించిన భారత క్రీడాకారులు, తర్వాతి రోజు మూడు పతకాలు గెలుపొందారు.
అభినవ్ బింద్రాకు ఇది చివరి కామన్వెల్త్ గేమ్స్ కాగా, కామన్వెల్త్ గేమ్స్‌లో మలైకా తొలి సారి పాల్గొంది. వీరిద్దరూ కూడా పతకాలు సాధించడం విశేషం. 10ఎం ఎయిర్ పిస్టోల్ విభాగంలో మలైకా వెండి పతకాన్ని సాధించింది. మరో యువ క్రీడాకారిణి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సంతోషి 53కిలోల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది.

సాధించా..
10ఎం ఎయిర్ రైఫిల్ విభాగంలో బంగారు పతకం సాధించిన తర్వాత తన ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న షూటర్ అభినవ్ బింద్రా.

పతకమే గురి
షూటింగ్ విభాగంలో పతకం సాధించేందుకు శ్రద్ధగా లక్ష్యంవైపు గురిపెట్టిన అభినవ్ బింద్రా.

పతకాలు చూపిస్తూ..
అభినవ్ బింద్రా(మధ్య) తన బంగారు పతకాన్ని చూపిస్తుండగా.. వెండి పతకాన్ని చూపిస్తున్న బంగ్లాదేశ్ క్రీడాకారుడు అబ్దుల్లా బాకి(ఎడమ), కాంస్యం సాధించిన డేనియల్(ఇంగ్లాండ్).

రవి, అభినవ్
రవి కుమార్(ఎడమ), అభినవ్ బింద్రాలు ఆటలో పాల్గొనే ముందు కలుసుకున్న దృశ్యం.

నిరాశలో హీనా
హీనా సింధు 10ఎం ఎయిర్ పిస్టోల్ విభాగంలో పతకాన్ని సాధించలేకపోవడంతో నిరాశలో హీనా సింధు.

మలైకా గోయల్
16ఏళ్ల మలైకా గోయల్ 10ఎం ఎయిర్ పిస్టోల్ విభాగంలో వెండి పతకాన్ని సాధించింది.

పతకంతో గోయల్
తాను సాధించిన వెండి పతకంతో చిరునవ్వులు చిందిస్తున్న మలైకా గోయల్.

రవి కుమార్
10ఎం ఎయిర్ రైఫిల్ విభాగంలో పాల్గొంటున్న సందర్భంగా సన్నద్ధమవుతున్న రవి కుమార్.

సంతోషి
53 కిలోల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో కాంస్య పతకం సాధించిన సంతోషి మత్స.

గగన్ నారంగ్
గగన్ నారంగ్ మంచి షూటరే కాదు, ఫొటో గ్రాఫర్ కూడా. కామన్వెల్త్ గేమ్స్‌లో మలైకా గోయల్ ఫొటోలు తీస్తున్న గగన్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications